వామ్మో ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదు.. ఈ రోజుల్లో కూడా ఇలా..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రూపొందుతాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం టాలీవుడ్ దర్శకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ బడా దర్శకులు కూడా ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. అందుకు సంబంధించిన రూమర్స్ రోజుకోటి వైరల్ అవుతూనే ఉంది.
ఇక ప్రస్తుతం గ్యాప్ లేకుండా ఒకేసారి మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ మొదటిసారి చాలా ఎక్కువగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో ఒకేసారి మూడు సినిమాలతో బిజీగా ఉండడం అంటే ఇండస్ట్రీలో అది మామూలు విషయం కాదు. గ్యాప్ లేకుండా ఒక వారం సలార్ షూటింగ్ లో అలాగే మరో వారం ఆదిపురుష్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రిలీజ్ కు సిద్ధం కావాల్సిన రాధేశ్యామ్ సినిమాకు కూడా ఫీనిషింగ్ టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో సీనియర్ హీరోలు ఒక వారంలో మూడు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లలో పాల్గొనేవారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇక రాధేశ్యామ్ సినిమా జూలై 30 న రాబోతున్న విషయం తెలిసిందే. ఆదిపురష్ 2022లో ఏప్రిల్ 14 రానుండగా అదే ఏడాది ఆగస్ట్ 13 కు సలార్ రానుంది.


Click it and Unblock the Notifications











