అఖిల్ ఏజెంట్ ఈవెంట్ కోసం రాబోతున్న అగ్ర హీరో.. అభిమానులకు పండగే!
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మంచి హైప్ తో వస్తున్న మూవీ ఏజెంట్. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. బజ్ కూడా క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ఒక సాంగ్, ట్రైలర్ మంచి టాక్ అందుకున్నాయి. ఇవి మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి. ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానున్న ఏజెంట్ మూవీ నుండి తాజాగా మరో అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఏజెంట్ మూవీ ప్రీ- రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా బజ్ ప్రకారం, ప్రీ- రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 23వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఏజెంట్ ప్రీ- రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తే సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. దీని వల్ల ఓపెనింగ్స్ భారీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏకే ఎంటర్‌టైన్మెంట్, సురేంజర్ 2 సినిమా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాయి.
ఈ మూవీకి వక్కంతం వంశీ కథ అందించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో వక్కంతం వంశీ సురేందర్ రెడ్డిది సూపర్ హిట్ కాంబినేషన్. కిక్ సినిమా నుంచి వీరిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని సిద్ధం చేశారు. ఏజెంట్ మూవీలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. మాఫియా డాన్ ని పట్టుకోవడానికి చేసే ఆపరేషన్ లో అతను ఎలా పని చేసాడు అనేది కథాంశం.

ట్రైలర్ ద్వారా సినిమాలో అయితే యాక్షన్ డోస్ కు ఏమాత్రం కుదవలేదు అని చెప్పకనే చెప్పేశారు. ఇక ట్రైలర్ చివరి షాట్ లో కూడా అఖిల్ గన్ తీసుకొని బుల్లెట్ల వర్షం కురిపించే సీను కూడా అద్భుతంగా ఉంది. మరి సినిమా ఫ్యాన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











