Prabhas మీ విజయాలకు దేశం గర్విస్తున్నది.. కామన్వెల్త్ విజేతలకు ప్రభాస్ శుభాకాంక్షలు
రీల్ స్టార్ కంటే రియల్ స్టార్ అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనిపించుకోన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేశం గర్వించే ప్రతి సందర్భంలో తన శుభాకాంక్షలు తెలిపేందుకు పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ డార్లింగ్ ప్రభాస్ ముందుంటారు. దేశానికి పేరు తెచ్చే ప్రతి ఒక్కరి పట్ల ప్రోత్సాహకరంగా స్పందిస్తుంటారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరుఫున పతకాలు సాధించిన క్రీడాకారులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో భారత క్రీడా వీరులు సాధించిన పతకాల పట్టికను పోస్ట్ చేస్తూ తన గ్రీటింగ్స్ తెలిపారు.

కామన్వెల్త్ క్రీడల విజేతలందరికీ కంగ్రాట్స్. మీరు సాధించిన విజయాలతో దేశం గర్విస్తోంది. భారత్‌కు మెడల్స్ సాధించడంలో మీరు చూపించిన పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి అంటూ థాంక్స్ నోట్ పోస్ట్ చేశారు.
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్న ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దేశంలో ఏ ప్రాంతం వారికైనా ఆయన బాహుబలిగా అభిమాన హీరో అయ్యారు. ఈ ఇమేజ్ కు అనుగుణంగానే ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్K , ఆదిపురుష్, స్పిరిట్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











