For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ దగ్గర పనిచేస్తే ఇలా ఉంటుంది.. అతని కోసం ల‌గ్జ‌రీ కారును బహుమతిగా..

    |

    టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని డార్లింగ్ అనే ముద్దు పేరు అంత ఈజీగా రాలేదు. ఆయన ఒక్కసారి లవ్ చేయడం స్టార్ట్ చేస్తే అంత ఈజీగా దూరంగా చేసుకోరు. ప్రభాస్ దగ్గర పని చేసేవాళ్ళు మొత్తం కూడా స్నేహితులు మాత్రమే ఉంటారు. ఇండస్ట్రీలో ప్రభాస్ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చినంతగా మరొకరు ఇవ్వలేరని చెప్పవచ్చు. అలాగే తన దగ్గర నమ్మకంతో పని చేసేవారికి కూడా ప్రభాస్ చాలా వాల్యూ ఇస్తాడు.

    Prabhas : జిమ్ ట్రైనర్ ఫ్యామిలీ కి 'డార్లింగ్' స్వీట్ సర్ ప్రైజ్!! || Oneindia Telugu
    బాహుబలి తరువాత కూడా..

    బాహుబలి తరువాత కూడా..

    ప్రభాస్ ఎవరిని కూడా అంత ఈజీగా దూరం చేసుకోడు అని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చెప్పే మాట. స్టార్ హీరోలైనా చిన్న హీరోలైనా కూడా ప్రభాస్ సమానంగా ఇష్టపడతాడు. బాహుబలి తరువాత తన హోదా పెరిగిందని ఏ మాత్రం బయటకు చూపించుకోవడం ప్రభాస్ కి నచ్చదు. ఇక ఇటీవల జిమ్ ట్రైనర్ కి ఈ హిరో ఒక ఖరీదైన కనుక ఇచ్చాడు.

    ప్రభాస్ పర్సనల్ ఫీట్నెస్ ట్రైనర్..

    ప్రభాస్ పర్సనల్ ఫీట్నెస్ ట్రైనర్..

    ప్రభాస్ జిమ్ ట్రైనర్ పేరు లక్ష్మణ్. కెరీర్ మొదటి నుంచి కూడా అతను ప్రభాస్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ గానే ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు ప్రభాస్ సినిమాల్లో ఒక పవర్ఫుల్ బాడీతో సరికొత్తగా కనిపించడానికి లక్ష్మణ్ చాలానే ఉపయోగపడ్డాడు. అందుకే ప్రభాస్ అతన్ని ఎక్కువగా ఇష్టపడతారు.

    రేంజ్ రోవర్ కారును బహుమతిగా..

    రేంజ్ రోవర్ కారును బహుమతిగా..

    ఇక రీసెంట్ గా ఈ స్టార్ హీరో తన ట్రైనర్ కి ఒక ఖరీదైన ల‌గ్జ‌రీ కారును బహుమతిగా ఇచ్చాడు. లక్షల విలువ చేసే రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చి తన మంచితనాన్ని చాటుకున్నాడు. అలాగే ట్రైనర్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    వారుసగా మూడు సినిమాలతో..

    వారుసగా మూడు సినిమాలతో..

    ఇక నెక్స్ట్ ప్రభాస్ మూడు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం యూరోప్ వెళ్లనున్నారు. ఇక ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాను పూర్తి చేయనున్నాడు.

    English summary
    The much awaited Prabhas 20th movie First Look has finally been released. UV Creations, which has been making fans a little impatient for years due to delays, got a good kick out of the whole first look. The title of Radheshyam has been fixed for the movie as everyone expected. The First Look title is currently trending on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X