Adipurush: ప్రభాస్ సంచలన రికార్డు.. ఏకంగా నాలుగు సినిమాలు.. ప్రపంచంలోనే ఏకైక హీరో అతడే

గతంలో కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం అయినా.. ఈ మధ్య కాలంలో మాత్రం ఏకధాటిగా భారీ బడ్జెట్‌తో కూడిన పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే కొన్ని సినిమాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లోనే 'ఆదిపురుష్' అనే చిత్రాన్ని చేస్తోన్నాడు. రామాయణం నాటి కథతో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక, ఇప్పుడు దీనితో ప్రభాస్ సంచలన రికార్డు సాధించాడు. వివరాల్లోకి వెళ్తే..

ఆదిపురుష్‌గా మారిన ప్రభాస్ : ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో వస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు.

 adipurush

అలాంటి కథతో ఆదిపురుష్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' అనే చారిత్రక సినిమాలోనూ నటిస్తున్నాడు. దీంతో బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో రామయణం నేపథ్యంతో రూపొందుతోంది. చెడుపై మంచి గెలవడం అనే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామాయణంలోని ప్రధానమైన థీమ్‌ను తీసుకుని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ట్రైలర్ రిలీజ్.. హైలైట్ సీన్స్ : 'ఆదిపురుష్' మూవీని జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవలే ఈ సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా మంచి విజువల్ ఎఫెక్ట్స్‌తో కట్ చేశారు. ముఖ్యంగా ఇందులో బ్యాగ్రౌండ్‌ స్కోర్, గ్రాఫిక్స్ అద్భుతంగా అనిపించాయి. ప్రతి విజువల్ కన్నుల పండుగగా ఉంది.

 adipurush

భారీ రెస్పాన్స్.. వ్యూస్, లైక్స్ : ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'ఆదిపురుష్' ట్రైలర్‌కు ప్రభాస్ అభిమానుల నుంచే కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా దీనికి అత్యధిక మొత్తంలో వ్యూస్, లైకులు దక్కుతున్నాయి. అంతేకాదు, విడుదలైన కొన్ని గంటల్లోనే ఇది యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ ఎన్నో రికార్డులను కూడా ఇది క్రియేట్ చేసింది.

 adipurush

సెంచరీ పూర్తి చేసేసిందిగా : 'ఆదిపురుష్' ట్రైలర్‌కు ఒక్క రోజులోనే యూట్యూబ్‌లో భారీ స్థాయిలో స్పందన దక్కిన విషయం తెలిసిందే. ఇది కేవలం 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలుపుకుని 74.02 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో దీనికి 2.11 మిలియన్ లైకులు కూడా సొంతం అయ్యాయి. ఇక, నాలుగు రోజులకే ఈ సినిమా వంద మిలియన్ వ్యూస్‌ను కూడా ఖాతాలో వేసుకుంది.

 adipurush

ప్రభాస్ నాలుగు సెంచరీలు : ప్రభాస్ రేంజ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా 'ఆదిపురుష్' ట్రైలర్ 4 రోజుల్లోనే వంద మిలియన్ వ్యూస్ సాధించింది. తద్వారా వరుసగా నాలుగు వంద అంతకంటే ఎక్కువ మిలియన్ల వ్యూస్ సాధించిన ట్రైలర్లు కలిగిన హీరోగా ప్రభాస్ ఇంటర్నేషనల్ రికార్డును సాధించాడు. 'బాహుబలి 2', 'సాహో', 'రాధే శ్యామ్' చిత్రాల ట్రైలర్లు సెంచరీలు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X