భారీ నష్టాల్లో ఉన్న నిర్మాత కోసం ప్రభాస్.. ఇంతకు డార్లింగ్ చేస్తున్న ఆ సినిమా ఏంటో తెలుసా?
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర అతి పెద్ద బాక్సాఫీస్ మార్కెట్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా మన తెలుగు హీరో రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే అని చెప్పి తీరాలి. ఇప్పుడు ప్రభాస్ ఒక్కడి పేరు మీదే 1000 కోట్ల మార్కెట్ నడుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కాగా తనకి హిట్ పడితే ఆ సినిమా సునాయాసంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పడానికి నిదర్శనంగా తన తాజా సెన్సేషన్ హిట్ చిత్రం "కల్కి 2898 ఎడి" ని చెప్పవచ్చు.
మరి ఈ సినిమాతో మళ్ళీ ప్రభాస్ మార్కెట్ వెనక్కి వచ్చింది. తన సినిమా కొన్న వారికి భారీ లాభాలు తాను అందించాడు. అయితే ఈ సినిమాకి ముందు చేసిన సినిమా "సలార్". దీనికి కూడా మంచి వసూళ్లే వచ్చాయి కానీ అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాలేదు దీనితో నష్టాలు తప్పలేదు. ఇంకా దీనికి ముందు రెండు సినిమాలు కూడా ప్రభాస్ సినిమాలు భారీ నష్టాలనే మిగిల్చాయి.

వాటిలో ప్రభాస్ బాలీవుడ్ చిత్రం "ఆదిపురుష్" కూడా ఒకటి. ఐతే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టాలనే మిగిల్చింది. అందుకే ఈ సినిమా నష్టాలు ఇవ్వడంతో ఆ సినిమాని కొనుకున్న నిర్మాతల కోసం ప్రభాస్ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడని టాక్ బయటకి వచ్చింది. మరి ప్రస్తుతం ప్రభాస్ పలు సినిమాలు చేస్తుండగా ఆ సినిమాల్లో ప్రభాస్ నష్టాలు పూడ్చేందుకు చేస్తున్న సినిమా ఏదంటే దర్శకుడు మారుతీతో చేస్తున్న "ది రాజా సాబ్" అట.
కాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే అప్పుడు ఆదిపురుష్ ని ఏకంగా 200 ఓట్లు పెట్టి కొని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. కానీ సినిమాకి దారుణమైన టాక్ రావడంతో మూడు రోజులు మాత్రమే సినిమా నిలిచింది. ఇలా లాంగ్ రన్ లో ఈ చిత్రం కేవలం సగం కూడా రాబట్టలేకపోయింది.

దీనితో ఆ నష్టాల్ని పూడ్చడానికే ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి సినిమా చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో తాజా టాక్. అందుకే మరీ అంత స్టార్ దర్శకుడు కాకపోయినా జస్ట్ ప్రభాస్ బ్రాండ్ అయినా కూడా మినిమమ్ బిజినెస్ చేసేస్తుంది అని మారుతీతో చేసేస్తున్నారట. మరి ఈ సినిమాతో అయినా నష్టాలు పూడి లాభాలు ఏమన్నా వస్తాయో లేదో అనేది వేచి చూడాలి.
కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ కనిపించనుండగా వారిలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు మొట్ట మొదటిసారిగా ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అలాగే మరో హీరోయిన్ రిద్ధి కుమార్(రాదే శ్యామ్) ఫేమ్ నటిస్తుందట. అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో మేకర్స్ వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట.


Click it and Unblock the Notifications











