నీటి అడుగున ప్రభాస్ సాహసం: ఆ రెండు సినిమాల తర్వాత మరోసారి

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో యూనివర్శల్ స్టార్ అయిపోయిన అతడు... ఆ తర్వాత వచ్చిన 'సాహో'తో హిందీలో మార్కెట్‌ను గణనీయంగా పెంచుకున్నాడు. దీంతో అతడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న 'రాధే శ్యామ్'లో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంతో రాబోతుందట. ఇందులో 1960 దశకంలో జరిగిన ఓ కథతో పాటు ప్రస్తుత పార్ట్‌ను చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కరోనా వల్ల ఆలస్యం అవుతోన్న ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా సాగుతోంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ చివరి షెడ్యూల్‌లో నీటిలో ఓ అద్భుతమైన సీక్వెన్స్‌ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో దాదాపు పది నిమిషాల పాటు ఉండే ఈ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందట. అందుకోసం ప్రభాస్ నీటి అడుగున సాహసం చేస్తున్నాడని టాక్.

Prabhas Doing Under Water Stunt for Radhe Shyam

రాజమౌళి తెరకెక్కించిన 'ఛత్రపతి'తో పాటు ప్రభుదేవా రూపొందించిన 'పౌర్ణమి'లో ప్రభాస్ నీటి అడుగున స్టంట్స్ చేశాడు. చాలా కాలం తర్వాత మరోసారి 'రాధే శ్యామ్'లో ఆ తరహా సన్నివేశంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా, దీని తర్వాత ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే సినిమా చేయనున్నాడు. దాని తర్వాత నాగ్ అశ్విన్ సినిమాతో పాటు ఓం రౌత్ తెరకెక్కించే 'ఆదిపురుష్' చిత్రాలను చేస్తాడని అంటున్నారు. ఇవన్నీ పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతున్న సినిమాలే కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X