‘సలార్’ నుంచి ముందే లీకైన సర్‌ప్రైజ్: ‘బాహుబలి’ తర్వాత మరోసారి అలా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ కాలంలోనే స్టార్‌గా ఎదిగిన హీరో. కెరీర్ ఆరంభం నుంచి మీడియం రేంజ్ సినిమాల్లోనే నటించిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' తర్వాత యూనివర్శల్ స్టార్ అయ్యాడు. దీంతో అప్పటి నుంచి పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'సలార్' ఒకటి. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఓ సర్‌ప్రైజ్ ముందే లీకైంది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Adipurush ఛలో హైదరాబాద్, RFC లోనే బెటర్ అన్న Prabhas | Salaar || Filmibeat Telugu
ఆ రెండు చిత్రాలు ప్రభాస్ క్రేజ్‌ను పెంచాయి

ఆ రెండు చిత్రాలు ప్రభాస్ క్రేజ్‌ను పెంచాయి

'బాహుబలి'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి చిత్రం 'సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశాడు. తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో నిరాశ పరిచిన ఈ మూవీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసి రికార్డులు క్రియేట్ చేసింది.

కెరీర్‌లో తొలిసారి అలాంటి సినిమాలో ప్రభాస్

కెరీర్‌లో తొలిసారి అలాంటి సినిమాలో ప్రభాస్

ప్రస్తుతం ప్రభాస్.. 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అవి అనుకుంటే.. దీనిని మొదలు పెట్టేశాడు

అవి అనుకుంటే.. దీనిని మొదలు పెట్టేశాడు

'రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీనితో పాటు 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఓం రౌత్ రూపొందించనున్నాడు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ ప్రకటించాడు. అన్నింటికంటే ముందే దీన్ని మొదలెట్టాడు.

దాని రేంజ్‌లోనే తీయబోతున్న ప్రశాంత్ నీల్

దాని రేంజ్‌లోనే తీయబోతున్న ప్రశాంత్ నీల్

'కేజీఎఫ్' తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్'ను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు. ఇందులో కూడా హీరో ఎలివేషన్‌ను హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో అతడి క్యారెక్టరైజేషన్ కేకలు వేయిస్తుందని అంటున్నారు. ఇక, ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

‘సలార్' నుంచి ముందే లీకైన భారీ సర్‌ప్రైజ్

‘సలార్' నుంచి ముందే లీకైన భారీ సర్‌ప్రైజ్


సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన 'సలార్' మొదటి షెడ్యూల్ సమయంలో గడ్డాన్ని ట్రిమ్ చేసి యంగ్ మ్యాన్‌గా కనిపించాడు ప్రభాస్. కానీ, సినిమా ప్రకటన సమయంలో మాత్రం క్లీన్ షేవ్‌తో పాటు కోరమీసంతో ఉన్న లుక్‌తో దర్శనమిచ్చాడు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్‌లలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ సర్‌ప్రైజ్ ముందుగానే లీకైంది.

‘బాహుబలి' తర్వాత మరోసారి అలా.. పండగే

‘బాహుబలి' తర్వాత మరోసారి అలా.. పండగే

తాజా సమాచారం ప్రకారం.. 'సలార్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అది కూడా తండ్రీ కొడుకుల పాత్రల్లో నటించబోతున్నాడని అంటున్నారు. 'బాహుబలి' తర్వాత ఈ సినిమాలోనే అతడు ఈ తరహా పాత్రలు పోషిస్తున్నాడు. అంతేకాదు, తండ్రి మాఫియా డాన్‌గానూ.. కొడుకు చిన్న డాన్‌గానూ కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X