Prabhas అభిమాని సూసైడ్ లెటర్.. నా చావుకు కారణం వాళ్లే అంటూ లేఖ.. సోషల్ మీడియాలో వైరల్
బాహుబలి, సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. కరోనావైరస్ కారణంగా ఈ చిత్రం పలుమార్లు షూటింగ్ మాత్రమే కాకుండా విడుదల తేదీ కూడా వాయిదాల పడుతూ వస్తున్నది. అయితే రాధేశ్యామ్ వాయిదా పడటంపై అభిమానులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రెబల్ స్టార్ అభిమాని సూసైడ్ నోట్ రాయడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ప్రభాస్ అభిమాని తన సూసైడ్ లేఖలో ఏం రాశారు? ఎందుకు రాశారనే విషయంలోకి వెళితే..

రాధేశ్యామ్ టీమ్‌పై ట్రోల్స్
రాధేశ్యామ్ చిత్రం సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వకపోవడం, టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ చేయకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు దర్శకుడు రాధాకృష్ణను ట్రోల్స్ చేస్తూ ట్వీట్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమ అసహనాన్ని అంతవరకే కొనసాగించారు. కానీ తాజాగా అభిమాని రాసిన లేఖ అందర్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.

అభిమాని సూసైడ్ లేఖ రాస్తూ...
యువీ క్రియేషన్స్‌కు నవంబర్ 11వ తేదీన ఓ అభిమాని లేఖ రాస్తూ.. సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు అని అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ లేఖలో తన ఆవేదనను పేర్కొన్నారు.

నా చావు చూసైనా అప్‌డేట్ ఇస్తారని..
అభిమాని తన లేఖలో మరింత భావోద్వేగానికి లోనై.. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ అంటూ లేఖలో అభిమాని కలత చెందాడు.
యూవీ క్రియేషన్స్,న రాధాకృష్ణ కారణం అంటూ
అంతటితో అభిమాని ఆగకుండా.. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ అభిమాని విన్నవించుకొన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Recommended Video

జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్?
ఇదిలా ఉండగా, రాధేశ్యామ్ చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు యూవీ క్రియేషన్స్ సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ చేయడానికి టీమ్ ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్దికాలంగా అభిమానులు ట్రైలర్లు, ఇతర అప్ డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











