ప్రభాస్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. డార్లింగ్ అంటూ డైరెక్ట్‌గా! రోజులు గడుస్తుంటే..

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. రోజులు గడుస్తున్నా కొద్దీ సెలబ్రిటీలు, సాధారణ ప్రజల మధ్య దూరం తగ్గుతూ వస్తోంది. అందుకు కారణం సోషల్ మీడియా. సామాజిక మాద్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ విస్తృతమవుతూ వస్తున్నాయి. వీటిని వేదికగా చేసుకొని ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తమ తమ అప్‌డేట్స్ ఇస్తున్నారు మన హీరోహీరోయిన్లు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్ కాకపోవడంతో ఆయనపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. వివరాల్లోకి పోతే..

ప్రభాస్ క్రేజే వేరు.. ఆ విషయంలో ఫ్యాన్స్ నిరాశ

ప్రభాస్ క్రేజే వేరు.. ఆ విషయంలో ఫ్యాన్స్ నిరాశ

సినిమాల పరంగా, హ్యుమానిటీ పరంగా ప్రభాస్ క్రేజే వేరు. సైలెంట్ గా ఉంటూనే తానేంటో నిరూపించడం రెబల్ స్టార్ నైజం. మొన్నటికి మొన్న కరోనాపై చేస్తున్న పోరాటం టాలీవుడ్ హీరోలందరికంటే ఎక్కువ మొత్తం (4 కోట్లు) ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. అయితే అలాంటి విషయాలను డైరెక్ట్ గా అభిమానులతో పంచుకోవడానికి ఆయన సోషల్ మీడియా ఖాతాలు లేకపోవడం ఫాన్స్‌లో నిరాశ నింపుతోంది.

చిరంజీవి ఎంట్రీ.. హోరెత్తిపోతున్న సోషల్ మీడియా

చిరంజీవి ఎంట్రీ.. హోరెత్తిపోతున్న సోషల్ మీడియా

ఇటీవలే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉగాది రోజే ట్విట్టర్ ఖాతా తెరిచిన చిరంజీవి అప్పటినుంచి యమ యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియాలో కూడా తానే మెగాస్టార్ అనేలా దూసుకుపోతున్నారు. అంతేకాదు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఆవశ్యకత ఏంటో తెలుపుతూ మెగాస్టార్ సామాజిక మాధ్యమాల్లో ఎంట్రీ ఇచ్చారు.

తమ తమ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని.. ముఖ్యంగా హీరోయిన్లు

తమ తమ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని.. ముఖ్యంగా హీరోయిన్లు

ఇకపోతే మిగిలిన హీరోలు, మరీ ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ లలో తమ తమ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని తమను తాము ఫుల్లుగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ తమ సినీ, వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు.

ప్రభాస్‌పై పెరుగుతున్న ఒత్తిడి

ప్రభాస్‌పై పెరుగుతున్న ఒత్తిడి

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ వెంటనే సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అందరు హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. మరి నువ్వెప్పుడు డార్లింగ్ అంటూ నేరుగా అడిగేస్తున్నారు నెటిజన్లు.

అదే జరిగితే.. ఊహించగలమా మరి!.

అదే జరిగితే.. ఊహించగలమా మరి!.

నెటిజన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్న దాంట్లో తప్పులేదనే చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాలకు డిమాండ్ బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రభాస్ లాంటి హీరో ఈ వేదికల్లో లేకపోవడం కాస్త వెలితిగా అనిపిస్తోంది. సో.. ఒకవేళ ఫ్యాన్స్ చేస్తున్న ఈ వినతి చూసి ప్రభాస్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలే గానీ ఆయన ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించగలమా మరి!.

Recommended Video

Alia Bhatt Surprised All, Became Die Hard Fan Of Prabhas
 పూజా హెగ్డేతో ప్రభాస్ రొమాన్స్

పూజా హెగ్డేతో ప్రభాస్ రొమాన్స్

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ కొద్ది రోజులు వాయిదా వేశారు. ఈ చిత్రానికి 'ఓ డియర్' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X