Prabhas సినిమాపై కూడా బాయ్‌కాట్ ఎఫెక్ట్.. 20కోట్లతో సినిమా.. ఫ్యాన్స్ ఆగ్రహం!
చిత్ర పరిశ్రమలో గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న అగ్ర హీరోలలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. బాహుబలి సినిమా తర్వాత వందల కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ తో సినిమాలు తెరపైకి తీసుకువచ్చేందుకు అగ్ర నిర్మాతలు ప్రముఖ దర్శకులు కూడా ఎంతో ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత మాత్రం ప్రభాస్ ఆ స్థాయిలో మళ్లీ మరో విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. రాదే శ్యామ్, సాహో రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చిన విషయం తెలిసిందే.
అయితే ప్రభాస్ మధ్యలోనే మారుతి దర్శకత్వంలో ఒక చిన్న సినిమా కూడా చేయాలని అనుకున్నాడు. మరి ఎక్కువ బడ్జెట్లో కాకుండా కేవలం 20 కోట్ల ప్రొడక్షన్ కాస్ట్ లో సినిమా అయిపోయే విధంగా చేయాలని అనుకున్నడు. అందుకోసం డివివి దానయ్య కూడా మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ మారుతి కలయికపై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గోపీచంద్ తో మారుతి తీసిన పక్కా కమర్షియల్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ప్రభాస్ అతనితో సినిమా చేసే అవకాశం లేదని టాక్ వచ్చింది. అయితే నిజానికి ప్రభాస్ మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు.

అదేవిధంగా ఇప్పుడు మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ను అనుసంధానం చేసే జెట్ స్పీడ్ లో ఒక చిన్న సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇదివరకే వీరి కలయికలో రాబోయే సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ సెట్ అయింది అని అది హారర్ కామిడీ నేపథ్యంలో రాబోతున్న సినిమా అని కూడా టాక్ వచ్చింది. కానీ ఇంతలోనే సినిమాపై ఒక నెగిటివ్ ట్యాగ్ అయితే ట్రెండ్ అవుతొంది. మారుతి ప్రభాస్ తో సినిమా చేసేందుకు వీలు లేదు అంటూ ఫ్యాన్స్ ఒక నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అలాగే రేపు గురువారం సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











