దటీజ్ ప్రభాస్.. ఆ అభిమానుల కుటుంబాలకు అండగా.. తక్షణం ఆర్ధిక సాయం!
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి హీరోగా ఉన్నా సరే అభిమానుల కోసం ఎంతగా తపించి పోతారు అనేది అందరికీ తెలుసు.. అయితే తన సినిమా విడుదల సమయంలో చనిపోయిన ఇద్దరు అభిమానుల కోసం ప్రభాస్ రెండు లక్షల రూపాయలు సహాయం చేసినట్లు తెలుస్తోంది.. ఆ వివరాల్లోకి వెళితే..

ఆర్థిక సహాయం చేసినట్లు టాక్
ముందుగా ఒక అభిమాని సినిమా థియేటర్ వద్ద ఫ్లెక్సీ కడుతూ ఉండగా కరెంట్ షాక్ కు గురై చనిపోగా మరో అభిమాని మాత్రం సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా బాగోలేదని అందరూ అనడంతో పాటు ఫ్లాప్ అయిందని టాక్ రావడంతో దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభాస్ ఆ ఇద్దరు కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసినట్లు టాక్.

రెండు లక్షల రూపాయలు
గుంటూరు జిల్లా పల్నాడు ఐనాక్స్ థియేటర్ వద్ద చల్లా కోటేశ్వరరావు అనే అభిమాని ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా పోస్టర్ కడుతూ కరెంట్ షాక్ కు గురై చనిపోయాడు. ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు డిస్ట్రిబ్యూటర్లు, యు.వి.క్రియేషన్స్ అలాగే ప్రభాస్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభాస్ మేనేజర్, ప్రభాస్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో వెంటనే ప్రభాస్ రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమని తన మనుషులకు పురమాయించారు. దీంతో వెంటనే కోటేశ్వరరావు భార్య అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు పడ్డాయి.

పాన్ ఇండియా స్టార్ గా
మరోపక్క కర్నూలు జిల్లాలో రవి తేజ అనే ఒక యువకుడు ప్రభాస్ సినిమా బాగాలేదు అనే ఉద్దేశంతో ఫ్లాప్ టాక్ వచ్చింది, అని బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విషయం కూడా మీడియా ద్వారా తెలుసుకున్న ప్రభాస్ తన అభిమానులను ఆమె తల్లి వద్దకు వెళ్లి ధైర్యం చెప్పడమే కాక ఆమె పేరు మీద కూడా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం. అయితే ప్రభాస్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నారు.
Recommended Video


చాలా బాధ పడినట్లు
ఈ విషయం మీద అసలు ఆయన ఏమీ తెలియకుండా ఉన్నట్టు ఉన్నా సరిపోతుంది కానీ తన అభిమానులు మరణించారన్న విషయం తెలుసుకుని ప్రభాస్ చాలా బాధ పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హాలిడేస్ ఎంజాయ్ చేయడం కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ ఈ అంశం మీద చాలా బాధ పడినట్లు చెబుతున్నారు. అయితే అభిమానుల కుటుంబాలకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











