గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్.. వాళ్లందరి ఖాతాల్లో రూ. 10 వేలు జమా
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలా మంది స్టార్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. 'బాహుబలి'తో తన సత్తాను దేశ వ్యాప్తంగా చాటుకున్న అతడు.. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' ఒకటి. ఈ చిత్రంపై హైప్ అంతకంతకూ పెరుగుతూనే పోతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'సలార్'. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్.. కొన్ని కొన్ని విరామాలతో చిన్నగా సాగుతూ వచ్చింది. అయినప్పటికీ ఇలా దాదాపుగా ఇటీవలే టాకీ పార్టు మొత్తాన్ని చిత్ర యూనిట్ పూర్తి చేసుకుందని తెలిసింది.

మిగిలిన పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. అనుకున్న సమయానికి దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది.
తన సినిమాలకు పని చేసే టెక్నీషియన్లు, వర్కర్లకు ప్రభాస్ గిఫ్టులు ఇస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా 'సలార్' మూవీ కోసం పని చేసిన సిబ్బందికి కూడా ఈ పాన్ ఇండియా హీరో ఊహించని బహుమతులు అందించాడని తెలిసింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'సలార్' మూవీ కోసం తీవ్రంగా శ్రమించిన యూనిట్‌లోని కొందరు వర్కర్లకు ప్రభాస్ రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని గిఫ్టు రూపంలో అందించాడట. ఇప్పటికే ఈ మొత్తాలను వాళ్ల వాళ్ల అకౌంట్లలో జమ చేయించినట్లు తెలిసింది. దీంతో అతడి గొప్ప మనసును అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇక, భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్‌లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











