తండ్రి మరణించిన రోజే.. పుట్టెడు శోకంతో ప్రభాస్ డబ్బు సాయం.. అందుకే అందరికీ డార్లింగ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బిగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చిత్రాల కోసం దేశంలోని ఆడియెన్సే కాదు.. ప్రపంచ ఆడియెన్స్ కూడా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి', 'సాహో', 'సలార్'తో ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతాఇంతా కాదు. అందుకే ప్రభాస్ సినిమాలకు వరల్డ్ మార్కెట్ లోనూ ఫుల్ డిమాండ్ ఉంది. బాహుబలి తర్వాత ఆయనకు హాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయంట. కానీ డార్లింగే బిజీ షెడ్యూల్ వల్ల వెళ్లలేకపోయారంట. ఏదేమైనా ప్రభాస్ అత్యధిక బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు.

కెరీర్ ప్రారంభంలో ఒక్క హిట్ కోసం ఎదురుచూసిన ప్రభాస్ ఇప్పుడు ఆయన ఉంటే చాలు బాక్సాఫీస్ షేక్ అవుతుందనే స్థాయికి ఎదిగారు. అలాగే.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని కూడా తన అభిమానులకు చాటి చెపుతున్నారు ప్రభాస్. మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరితోనూ చిన్నపాటి విమర్శను కూడా తెచ్చుకొని హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఇండియన్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఒక్కడేఅని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్, బాలీవుడ్, కన్నడ చిత్ర పరిశ్రమల్లో పనిచేసిన డార్లింగ్ కు అక్కడి వారు ఫిదా అవ్వడమే గానీ ఏ విషయంలోనూ కంప్లైంట్స్ రావంతే. అలాంటింది మన డార్లింగ్ వ్యక్తిత్వం.

Prabhas Financial Help to Writer Thota Prasad Rebel star s Father died same day

అయితే.. ఇప్పటి వరకు డార్లింగ్ గొప్ప తనాన్ని మాటల్లో చూస్తూనే వచ్చాం. కానీ ఒక సందర్భం గురించి చెబితే ఆయన నిజంగా రాజుల వంశానికి కొత్త నిర్వచనం ఇచ్చారనే అంటారు. తాజాగా ఫిల్మ్ రైటర్ తోట ప్రసాద్ ప్రభాస్ గొప్ప మనస్సును తెలియజేశారు. తనకే ప్రభాస్ ఆర్థిక సాయం చేశారని చెప్పారు. అది సాధారణమైన హెల్ప్ కాదండోయ్.. అసలు విషయం తెలిస్తే మీకే అర్థమవుతుంది. తోట ప్రసాద్ ఒకసారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంట. అవే విషయం ప్రభాస్ వరకు వెళ్లిందంట. వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బు అవసరం ఉందని డార్లింగ్ కు తెలిసింద.

ప్రసాద్ కు సాయం అందించే రోజే డార్లింగ్ తండ్రి సూర్య నారాయణ మరణించారంట. పుట్టెడు శోకంలోనూ తన సినిమాకు పనిచేసిన రైటర్ కు ఆర్థిక సాయం అందజేశారంట. ఇచ్చిన మాట ప్రభాస్ తప్పబోడు అనేందుకు ఇదొక నిదర్శనం. ఎవ్వరికైనా తండ్రి మరణించడమనేది జీవితంలోనే భరించలేని క్షణం. అలాంటి దుఃఖంలోనూ డార్లింగ్ ఆర్థిక సాయం చేసి గొప్ప మనస్సును చాటుకున్నారని తోట ప్రసాద్ చెప్పారు. ఆయన్ని చాలా కేర్ కూడా తీసుకున్నారని చెప్పారు. ఇక తోట ప్రసాద్ కన్నప్పకు రైటర్ గా వర్క్ చేశారు.

ప్రభాస్ కల్మషంలేని మనస్సుకు తోడు సాయం చేసే గుణంతో అందరి మనస్సులు గెలుచుకుంటున్నాడు. హ్యుమానిటీ అంటే అలా ఉండాలని ప్రభాస్ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. ఆయనలా ఉండేందుకు అభిమానులే కాదు.. నార్మల్ ఆడియెన్స్ కూడా ప్రయత్నిస్తుంటారు. అంతేందుకు రీసెంట్ గానే 'కన్నప్ప' హీరో మంచు విష్ణు కూడా ప్రభాస్ నుంచి గొప్ప వ్యక్తిత్వాన్ని నేర్చుకున్నానని చెప్పారు. ఎదిగినా.. ఒదిగి ఉండే ప్రభాస్ కు అభిమానులు జై కొడుతున్నారు. ఆయన సినిమాలను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2898 ఏడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరోవైపు 'కన్నప్ప'తోనూ అలరించబోతున్నారు.

More from Filmibeat

Read more about: prabhas fauji raja saab
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X