రాజమౌళిపై పగబట్టిన ప్రభాస్.. నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్.
Prabhas vs Rajamouli: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి అందరికీ తెలుసు. ఛత్రపతి మూవీ సమయంలో వారి స్నేహం ప్రారంభమైంది. ఆ తరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి సీరిస్ ప్రపంచ స్థాయి విజయాన్ని అందుకుంది. దీంతో వీరి స్నేహం మరింత బలపడింది. కానీ, ప్రస్తుతం హీరో ప్రభాస్(Prabhas) కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో డార్లింగ్ విలన్‌గా మారి రాజమౌళిపై ఊహించని విధంగా కామెంట్స్ చేస్తుంటాడు. ఇంతకీ ఏం జరిగిందో ఓ లూక్కేయండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస హిట్స్ దూసుకుపోతున్నారు. కల్కి, సలార్ వంటి హిట్ తో ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం రాజాసాబ్, కల్కి-2, సలార్-2, స్పిరిట్, ఫౌజీ అంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే.. మహేష్ బాబుతో భారీ బడ్జెట్ మూవీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో జక్కన్న కష్టపడుతున్నారు. ఇదెలా ఉంటే.. తాజాగా డైరెక్టర్ రాజమౌళి పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రారంభంగానే.. హీరో ప్రభాస్ ఆగ్రహంతో ఊగిపోతూ.. చత్రపతి ఎవరివల్ల హిట్ అయిందని తన పక్కనున్న వారిని అడుగుతాడు. దీంతో పక్కన ఉన్న ఫ్రెండ్ 'కచ్చితంగా మీ వల్లే' అంటూ బదిలిస్తారు. మరి ఈ విషయం ఆయనకెందుకు అర్థం కావట్లేదు. అతని ఫ్రెండ్స్ ఇంతకీ ఆయన ఎవరని ప్రభాస్ ను తిరిగి ప్రశ్నిస్తారు. 'ఆయనే డైరెక్టర్' అంటూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు.
అసలు ఏమైందని ప్రశ్నించగా ఫ్లాష్ బ్యాక్ వెళ్లి.. చత్రపతి షూటింగ్ సమయంలో కత్తిని ఇవ్వకుండా డైరెక్టర్ రాజమౌళినే దగ్గర పెట్టుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ గొడవకు కారణం కెమెరామెన్ సెంథిల్ అంటాడు ప్రభాస్. ఆ తర్వాత సెంథిల్ కు షూటింగ్ ఉందని పిలిచి.. కిడ్నాప్ చేస్తారు ప్రభాస్ అండ్ టిం. పైగా మూడు రోజుల వరకు బయటకు రానివ్వద్దని తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. 'ఇకనుండి మీరు విలన్ ఛత్రపతిని చూస్తారు' అంటూఫన్నీ డైలాగ్ చెప్తాడు ప్రభాస్.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియో పై ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు తమలైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'అబ్బా ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా' అని ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది 'డార్లింగ్ కొంచెం ఓపిక పట్టు.. మంచి రోజులు వస్తాయి' మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.


Click it and Unblock the Notifications











