For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas ట్రీట్‌మెంట్ కోసం ప్రభాస్‌ విదేశాలకు.. ఆందోళనలో ఆదిపురుష్ డైరెక్టర్!

  |

  బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోవడమే కాకుండా బాలీవుడ్ హీరోలకు తలదన్నేలా సూపర్ హీరోలా మారిపోయాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించబోతున్నాడు. ఇండియాలో ఏ హీరోకు దక్కని ఫాలోయింగ్ అటు సోషల్ మీడియాలోను.. ఇటు సినీ ఇండస్ట్రీలోను సొంతం చేసుకొన్నాడు. అయితే ఇటీవల కాలంలో ప్రభాస్ తన దేహదారుఢ్యం, ఫిట్‌నెస్‌పై పట్టు కోల్పోయాడనే విషయం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. అయితే తనలోపాలను సరిద్దిద్దుకొనేందుకు ప్రభాస్ సిద్దమయ్యారనే విషయం బయటకు వచ్చింది. ఇక ప్రభాస్ వ్యక్తిగత విషయాలు, ఆయన నటించే సినిమాల గురించి వివరాల్లోకి వెళితే..

  ఆదిపురుష్ సినిమా షూట్ కోసం

  ఆదిపురుష్ సినిమా షూట్ కోసం

  సాహో మూవీ తర్వాత ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత మేరకు పూర్తయింది. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన షూటింగులో పాల్గొన్నారు.

  ప్రభాస్‌ను దారుణంగా ట్రోలింగ్

  ప్రభాస్‌ను దారుణంగా ట్రోలింగ్

  ముంబైలో ఆదిపురుష్ షూటింగులో పాల్గొన్న సమయంలో మేకప్ లేకుండా క్యాజువల్‌గా ఉన్న ప్రభాస్ ఫోటోలను ముంబై ఫోటోగ్రాఫర్లు క్లిక్ అనిపించారు. అయితే ముఖమంతా వాడిపోయి.. విపరీతంగా లావెక్కినట్టు కనిపిచండంతో ప్రభాస్‌ను అంకుల్.. వడపావ్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ఆ విషయం, ఆయన ఫోటోలపై భారీగా చర్చ జరిగింది. ప్రభాస్ తన శరీరంపై సరిగా శ్రద్దపెట్టడం లేదనే మాట వినిపించింది.

  రాముడి పాత్రకు తగినట్టుగా

  రాముడి పాత్రకు తగినట్టుగా

  ప్రభాస్‌పై భారీగా ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో ఆదిపురుష్ డైరెక్టర్‌ ఓం రావత్ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. శ్రీరామచంద్రుడు పాత్రలో కనిపిస్తున్నందున బాడీలో సున్నితత్వం కనిపించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సూచించారట. అత్యవసరంగా లుక్‌ను, బరువును తగ్గించుకొంటే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారట. దాంతో ప్రభాస్ యూకే వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

  ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్ల వద్దకు

  ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్ల వద్దకు

  ఆది పురుష్ సినిమా కోసం లుక్, బాడీ వెయిట్‌ను తగ్గించుకొనేందుకు ప్రభాస్ ఇంగ్లాండ్ వెళ్తున్నారు. అక్కడ ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ డాక్టర్స్, డైటీషియన్స్‌ను కలిసి తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే ప్రభాస్ కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనే పట్టుదలతో యంగ్ రెబల్ స్టార్ ఉన్నట్టు తెలిసింది.

  Prabhas కి హాట్సాఫ్.. Megastar Chiranjeevi మాస్ హీరో - Harbhajan Singh
  ప్యాన్ వరల్డ్ లుక్ కోసం కూడా

  ప్యాన్ వరల్డ్ లుక్ కోసం కూడా

  ప్రభాస్ లుక్, శరీర బరువు తగ్గించుకోవడమేని కేవలం ఆదిపురుష్ కోసమే కాకుండా నాగ్ అశ్విన్ రూపొందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రభాస్ తన లుక్‌ను పాన్ ఇండియా స్థాయికి కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ఆకట్టుకొనే విధంగా చర్యలు తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది. నాగ్ ఆశ్విన్ మూవీ పాన్ వరల్డ్ మూవీ అని చెప్పుకొంటున్న సంగతి తెలిసిందే.

  English summary
  Adipurush Director Om Raut Concerned About Prabhas Looks. Rebel Star #Prabhas Flying to #UK to meet World-Class Doctors & Dietician’s in order to take care of his looks & body weight.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X