For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas: అంకుల్, వడా పావ్‌లా ఉన్నాడంటూ దారుణమైన ట్రోలింగ్.. వాళ్ళంటే అన్నారు వీళ్ళకేం!

  |

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆయన చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. చివరిగా సాహో సినిమా చేసిన ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్ చేస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూట్ పూర్తికావచ్చింది. అయితే తాజాగా ఆయన ముంబైలో కనిపించగా కారులో ఉన్న ఒక పిక్ వైరల్ అవుతోంది. దీని మీద బాలీవుడ్ నుంచి తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  Anita Hassanandani: పెళ్ళయి పిల్లాడున్నా తగ్గని నువ్వునేను హీరోయిన్...మాల్దీవుల్లో మత్తెక్కిస్తూ!

  వరుస సినిమాలు

  వరుస సినిమాలు

  ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశారు. నాగ్అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్'‌, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ అన్ని సినిమాల విషయం పక్కన పెడితే ఆదిపురుష్ టీమ్‌ను మాత్రం వరుసగా కష్టాలు వెంటాడుతూ వచ్చాయి.

  ‘ఆదిపురుష్'‌ సినిమా మొదలయ్యాక ముంబైలో అగ్ని ప్రమాదం మొదలు, మహారాష్ట్ర లాక్ డౌన్ దాకా అన్నీ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు అనేక అవాంతరాల అనంతరం ఆదిపురుష్ షూట్ ముంబైలో ఈ మధ్యనే తిరిగి ప్రారంభమైంది. రాధే శ్యామ్ మరియు సలార్‌ సినిమాల షూటింగ్ చేస్తూనే ప్రభాస్ గ్యాప్ లో ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.

  ఆదిపురుష్ కోసం ముంబైలో

  ఆదిపురుష్ కోసం ముంబైలో

  బాహుబలి స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ షూట్ కోసం ముంబైలో ఉన్నాడు. ఇటీవల నగరంలో ప్రభాస్ ఆదిపురుష్ నృత్య సాధన కోసం వెళ్తున్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ప్రభాస్ మేకప్ లుక్‌లో కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ప్రేక్షకులు డార్లింగ్ బరువు పెరిగాడని ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ 50 ఏళ్ళ తన మామ లాగా కనిపిస్తున్నాడని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.

  అంకుల్, పాలవాడు, అంటూ!

  అంకుల్, పాలవాడు, అంటూ!

  "తు ఖుద్ వాడా-పావ్ బాన్ గయా ప్రభాస్," అని మరొక నెటిజన్ రాశాడు. "అతను ఎందుకు అంకుల్ లా కనిపిస్తాడు?" "యే మిల్క్‌మన్ లాగ్ రహా హై," మరియు "యే తో బుద్ధా హో గయా." అంటూ రకరకాల కామెంట్లు చేసారు. నార్త్ ప్రేక్షకులు సౌత్ ఇండియన్ నటీనటులను వారి లుక్ మరియు ఫిజిక్ కోసం ట్రోల్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ప్రభాస్ ను సాహో విషయంలో ట్రోల్ చేశారు.

  వాళ్ళంటే అన్నారు వీళ్ళకేం పోయేకాలం

  వాళ్ళంటే అన్నారు వీళ్ళకేం పోయేకాలం

  ఇక ప్రముఖ బాలీవుడ్ టాబ్లాయిడ్ ప్రభాస్ గురించి చాలా దారుణమైన కథనాన్ని ప్రచురించింది. ప్రభాస్ లేటెస్ట్ పిక్ ను ఉటంకిస్తూ, టాబ్లాయిడ్ పైన పేర్కొన్న కామెంట్స్ అన్నిటితో ప్రభాస్ అంకుల్ అని, మేకప్ లేని పాల వాడిలా ఉన్నాడని, వడా పావ్ లా ఉన్నాడని వర్ణిస్తూ దిగజారుడు పదాలను ఉపయోగించింది. ఈ కథనం సహజంగానే ప్రభాస్ మరియు తెలుగు సినీ అభిమానుల నుండి తీవ్ర విమర్శలకు గురైంది. నిజానికి పదాల ఎంపిక నిజంగా అవమానకరమైనది అయినప్పటికీ, ప్రభాస్ ఈ ఫోట్లో కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడనే వాస్తవాన్ని విస్మరించలేము.

  ఇండియన్ సూపర్ స్టార్

  ఇండియన్ సూపర్ స్టార్

  నిజానికి బాహుబలి తర్వాత ప్రభాస్ నిజంగా ఇండియన్ సూపర్ స్టార్ అయ్యే అవకాశం వచ్చింది. ఇది దక్షిణాది నుంచి ఎవరూ ఊహించలేని విషయం. కానీ సాహో లాంటి సినిమాతో దానిని ఆయన వృధా చేసుకున్నాడని బాలీవుడ్ వారి అభిప్రాయం. సాహోలో ప్రభాస్ లుక్స్ చాలా ట్రోల్స్ కు కారణం అయ్యాయి. అప్పట్లో ఇది పెద్ద రచ్చకి దారి తీసినా తరువాత కొంత సెట్ అయింది. అయితే మళ్ళీ రోజులు గడిచే కొద్దీ మరింత దిగజారుతున్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు.

  ఇంత అవసరమా?

  ఇంత అవసరమా?

  ఈ ఫొటోలో ప్రభాస్ కాస్త బొద్దుగా.. కనిపిస్తున్నారన్న మాట వాస్తవమే. కానీ దానికే ఇంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ సినిమాల్లో లేదా ఫోటోలలో కనిపించినట్లు రియల్ లైఫ్ లో కనిపించరు. పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం వెండితెరపై ఒక విధంగా.. బయట ఒక విధంగా కనిస్తూ ఉంటారు.

  కాస్త టైర్డ్ గా కనిపించినంత మాత్రాన ఈ స్థాయిలో ట్రోల్ చేస్తూ విమర్శించడం నిజంగా బాధాకరమె చెప్పాలి. అయితే ఒక సౌత్ ఇండియన్ స్టార్ ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదుగుదల చూసి తట్టుకోలేక బాలీవుడ్ వాళ్ళు ఇలా కామెంట్స్ చేస్తున్నారని ప్రభాస్ అభిమానులు కౌంటర్ గా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళంటే అన్నారు వీళ్ళకేం పోయేకాలం అంటూ కామెంట్ చేస్తున్నారు.

  Prabhas పై పెరుగుతున్న అక్కసు.. అప్పుడు రజినీ ఇప్పుడు డార్లింగ్ | Pan India || Filmibeat Telugu
  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతుండగా.. ఇందులో ప్రభాస్ సరసన కృతి సనన్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మీద ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయన రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువ భాగం సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద ఆధార పడి ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కంటే ముందే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.

  English summary
  Many people commented about Prabhas. and says that he was looking like an uncle or a milkman without his makeup.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X