‘రాధేశ్యామ్’ కోసం ఇటలీకి.. డార్లింగ్ ‌లుక్‌కు అందరూ ఫిదా.. బర్త్ డే కూడా అక్కడే!!

మొత్తానికి ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొనబోతోన్నాడు. పెద్ద హీరోలందరూ గడప దాటడానికి బయపడుతుంటే.. ప్రభాస్ ఏకంగా దేశాలు, ఖండాలు దాటుతున్నాడు. అది కూడా ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న రాధేశ్యామ్ కోసమే. అప్పట్లో ఈ ఇటలీ షెడ్యూల్‌ను పూర్తి చేయాల్సి ఉండగా.. ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఇక ఇదంతా కుదరదని హైద్రాబాద్‌లో సెట్ వేసినా.. వర్కౌట్ కాలేదు. అంతలోపే కరోనా మహమ్మారి విజృంభించడం ప్రారంభించింది.

మొత్తం వెనక్కి..

మొత్తం వెనక్కి..

అసలే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ కరోనా దెబ్బకు రాధే శ్యామ్ మొత్తం షెడ్యూల్ రివర్స్ అయింది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న సమయంలోనూ ఇటలీకి వెళ్లి వచ్చారు. కానీ అక్కడ పూర్తిగా షూట్ చేయలేదు. అలా సినిమా వెనక్కి జరుగుతూ వస్తూనే ఉంది. కనీసం అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు.

ఫ్యాన్స్ గోల తట్టుకోలేకనే..

ఫ్యాన్స్ గోల తట్టుకోలేకనే..

రాధేశ్యామ్ షూటింగ్ మొదలెట్టి దగ్గర దగ్గర ఏడాది అయినా కూడా ఒక్క అప్డేట్, పోస్టర్, టైటిల్ ఇలా ఏ విషయంలోనూ అప్డేట్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్‌లో వీరు చేసిన రచ్చ వల్లే రాధేశ్యామ్ టైటిల్ అండ్ పోస్టర్‌ను విడుదల చేశారు.

పూజా ట్వీట్‌తో..

పూజా ట్వీట్‌తో..

ఆగస్ట్‌లో దర్శకుడు రాధాకృష్ణ సినిమా షూటింగ్, షెడ్యూల్‌కు సంబంధించి ఓ ట్వీట్ చేశాడు. సెప్టెంబర్ రెండు, మూడు వారాల్లో షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలిపాడు. అయితే ఆ షెడ్యూల్ కాస్త ఆలస్యమై అక్టోబర్‌కు వచ్చింది. ఇదే విషయాన్ని పూజా హెగ్డే పరోక్షంగా చెబుతూ.. మీ అందరితో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నాను.. ఇక సెట్‌లో ఇద్దరి బర్త్ డేలు సెలెబ్రేట్ చేయొచ్చు అని తెలిపింది.

Recommended Video

#Prabhas20Firstlook : Prabhas 20 Title Might Be Annouce This June!
లెటెస్ట్ పిక్స్..

లెటెస్ట్ పిక్స్..

తాజాగా ప్రభాస్ ఇటలీకి బయల్దేరుతుండగా విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు. అలా నడుస్తూ ఉండగా నాచురల్‌గా వచ్చిన ఫోటోల్లో డార్లింగ్ స్వాగ్, స్టైల్, లుక్ అదిరిపోయాయి. ఇక ఇటలీలో అక్టోబర్ మొత్తం షూట్ జరుపుతారని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్, పూజాల మధ్య రొమాంటిక్స్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతోన్నాయని సమాచారం. ఇదే షెడ్యూల్‌లో ప్రభాస్ (అక్టోబర్ 23), పూజా హెగ్డే (అక్టోబర్ 13) ఇద్దరి బర్త్ డేలు సెలెబ్రేట్ చేయబోతోన్నట్టు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X