Prabhas: ప్రభాస్ ఇదేం స్పీడ్.. ఫౌజీ కోసం కెరీర్లో ఎన్నడూ లేని విధంగా..!
Prabhas Hanu Raghavapudi Movie :పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో వరుసగా భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్న డార్లింగ్ ప్రభాస్ పుల్ జోష్ లో ఉన్నారు. ఇలా పాన్ ఇండియా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను అందుకున్న ప్రభాస్ త్వరలో రాజాసాబ్ మూవీలో రాబోతున్నారు. ఈ మూవీ తరువాత హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందనున్న ఫౌజీ సినిమాను లైన్ లో పెట్టనున్నారట. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డార్లింగ్ ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నడూ చేయని సాహసం చేయబోతున్నారంట. ఇంతకీ ప్రభాస్ ఏం చేయబోతున్నారట.
డార్లింగ్ ప్రభాస్ సినిమా లైన్ అప్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మల్సిందే. వరుస కమిట్మెంట్లను చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకు వెళ్తున్న ప్రభాస్.. ప్రస్తుతం ' రాజాసాబ్' అనే హర్రర్ కామెడీ సినిమాతో ముందుకు రాబోతున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయింది. వాస్తవానికి ఈ సినిమా గతేడాది చివరిలో విడుదల కావాల్సింది. కానీ ఈ హర్రర్ అండ్ కామెడీ ట్రైలర్ మూవీని ఏప్రిల్ కు వాయిదా వేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, విఎఫ్ఎక్స్ సంబంధించిన సీన్స్ ఎడిటింగ్ డిలే అవుతుండడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి కాకుండా జూన్ ప్రారంభంలో గాని, చివర్లో గాని విడుదల చేయబోతున్నారనే టాక్ వస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత.. హను రాఘవ పూడి డైరెక్షన్‌లో 'ఫౌజీ' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ తన వింటేజ్ లుక్‌తో కనిపించబోతుండటంతో సినిమాపై కూడ భారీగా అంచనాలు పెరిగాయి. ప్రభాస్ లైన్ అప్ లో ఇక కల్కి 2, సలార్ 2 తో పాటు మరో రెండు పాన్ ఇండియా సినిమాలు చేతిలో ఉన్నాయి. వీటన్నింటిని లైన్ లో పెట్టాలంటే.. ప్రభాస్ జెట్ స్వీడ్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే.. ఈ సినిమాలు తెరకెక్కడం కష్టమే అని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ తన కెరీర్ లో ఎవరూ ఊహించని విధంగా షూటింగ్స్ లో పాల్గొంటున్నారట.
ఈ క్రమంలో హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా కోసం ప్రభాస్ తెగ కష్టపడుతున్నారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొన్నారట. మరో రెండు వారాల పాటు షూటింగ్ జరుగుతుందని, దాంతో సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అవుతాయని తెలుస్తోంది.

తాజా పరిణామాలను చూస్తే.. ఫౌజీ సినిమా ఊహించిన దాని కంటే చాలా వేగంగా షూటింగ్ పూర్తి అయ్యేలా ఉంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించే ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడంట. ఏకకాలంలో రెండు లోకేషన్స్ ల్లో పాల్గొంటున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలోని కొన్ని భాగాలను చిత్రీకరిస్తుంటే.. మరికొన్ని అల్యూమినియం ఫ్యాక్టరీలో సమాంతర షూటింగ్ చేస్తున్నారట. సినిమాను అనుకున్నదాని కంటే.. వేగంగా పూర్తి చేయడానికి ప్రభాస్ రెండు షూటింగ్ లొకేషన్‌ల్లో పాల్గొంటున్నారట.
సాధారణంగా ప్రభాస్ చాలా తీరికగా.. నిదానంగా షూటింగ్ చేస్తారు. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ కూడా చాలా తీసుకుంటారు. కానీ ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నాడు లేని విధంగా విరామం లేకుండా.. అహోరాత్రులు కష్టపడుతున్నారట టాలీవుడ్ టాక్. ప్రభాస్ ఇలా వర్స్ చేసుకుంటే వెళ్లే.. ఆయన లైనప్‌లో మరిన్ని సినిమాలు చేరే అవకాశముందని డార్లింగ్ ప్యాన్స్ భావిస్తున్నారు.
'రాజా సాబ్, హను రాఘవ పూడి 'ఫౌజీ' సినిమాల తరువాత ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రం కూడా ప్రారంభం కానుంది. మరోవైపు.. 'కల్కి 2898 ఏడీ' మూవీకి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పటికే పార్ట్ పార్ట్ తో పాటు పార్ట్-2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఇక ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. అయితే మొదట్లో కల్కి పార్ట్ 2 ను 2026లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
కాగా ప్రస్తుతం ప్రభాస్ వర్క్ లైన్ వల్ల 'కల్కి-2 'సీక్వెల్ ప్లాన్ మారినట్లుగా తెలిసింది. 2026 ఎండింగ్‌లో లేదా 2027లో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎప్పుడు పాల్గొంటారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











