పవన్, ఎన్టీఆర్, మహేష్ రికార్డులను తిరగరాసిన ప్రభాస్.. కేవలం 20 నిమిషాల్లోనే!

Recommended Video

Prabhas Beats Pawan Kalyan, Mahesh Babu & Jr NTR || Filmibeat Telugu

ప్రభాస్ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు సాహో టీజర్ గొప్ప రిలీఫ్‌ను ఇచ్చేసింది. గురువారం (జూన్ 13న) విడుదలైన టీజర్ కొద్ది గంటల వ్యవధిలోనే రికార్డులు సృష్టిస్తున్నది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అలాంటి అంచనాలను దృష్టిలో పెట్టుకొని టీజర్‌ను ఇంటర్నేషనల్ స్థాయిలో కట్ చేశారు. తాజాగా ప్రభాస్ టీజర్ పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి హీరోల టీజర్ల రికార్డులను తిరుగరాస్తున్నది. వివరాల్లోకి వెళితే..

సాహో టీజర్ రికార్డుల హోరు

సాహో టీజర్ రికార్డుల హోరు

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సాహో టీజర్‌ను గురువారం ఉదయం 11.23 నిమిషాలకు రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు అనూహ్యంగా రెస్పాన్స్ రావడంతో రికార్డులను తిరుగరాస్తున్నది. యూట్యూబ్‌లో కేవలం 26 నిమిషాల్లోనే 100k లైక్స్ సాధించింది. ఇది టాలీవుడ్‌లో నాన్ బాహుబలి క్యాటగిరీలో ఓ రికార్డు.

పవన్ కల్యాణ్ రికార్డు

పవన్ కల్యాణ్ రికార్డు

గతంలో పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం అప్పట్లో కొత్త రికార్డును తిరుగరాసింది. ఆ చిత్ర ట్రైలర్‌ కేవలం 30 నిమిషాల్లోనే 100K లైకులను సాధించింది. అది పవన్ కల్యాణ్ స్టామినాకు నిదర్శనంగా నిలిచింది.

 జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత మూవీ

జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత మూవీ

అజ్ఞాతవాసి తర్వాత విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం అరవింద సమేత చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. అయితే పవన్ కల్యాణ్ పేరిటి ఉన్న రికార్డును అధిగమించలేకపోయింది. ఆ చిత్రం కూడా కేవలం 30 నిమిషాల్లోనే 100k లైక్స్ సాధించింది.

భరత్ అనే నేను, మహర్షి మూవీ టీజర్లు

భరత్ అనే నేను, మహర్షి మూవీ టీజర్లు

అజ్ఞాతవాసి, అరవింద సమేత చిత్రాల తర్వాత వచ్చిన భరత్ అనే నేను, మహర్షి టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పవన్, ఎన్టీఆర్ సినిమాల రికార్డును మహేష్ సినిమా అధిగమించలేకపోయింది. భరత్ అనే నేను 35 నిమిషాల్లో 100k, మహర్షి చిత్రం 40 నిమిషాల్లో 100k లైక్స్ సాధించింది.

రికార్డులపై సాహో టీజర్ గురి

రికార్డులపై సాహో టీజర్ గురి

ప్రస్తుతం సాహో టీజర్ జోష్ చూస్తుంటే, ఈ రికార్డుల పరంపర ఇప్పట్లో ఆగేటట్టు కనిపించడం లేదు. మరిన్ని భారీ రికార్డులను స్థాపించే అవకాశం ఉంది. ప్రభాస్ లుక్, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న నేపథ్యంలో రికార్డు లైక్స్, వ్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X