2 గంటల్లో చనిపోయే ఫ్యాన్ కోసం ప్రభాస్ షూటింగ్ క్యాన్సిల్.. 20 రోజులపాటు.. నిజం తెలిస్తే కన్నీళ్లు ఆగవు
అభిమాని లేనిదే హీరోలు లేరు అనే మాట అందరికి తెలిసిన కూడా ఆ పదానికి విలువనిచ్చే హీరోలు కొంతమందే ఉంటారు. పైకి అభిమానులంటే ప్రాణమని చెప్పినా ఆ తరువాత వాళ్లనే తిట్టి కొట్టేవాళ్లు కూడా ఉంటారు. అయితే ఎవరైనా అభిమాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వచ్చే వారు కొంతమందే ఉంటారు. అందులో ప్రభాస్ ఒకరు. ఇంకాసేపట్లో చనిపోతాడు అనగా ఓ కుర్రాడిని ప్రభాస్ కలిసి మాట్లాడగానే ఆ సంతోషంతో అతను ఇంకొన్ని రోజులు బతకడం విశేషం. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరుత పిల్ల నేహా శర్మ అందాల బికినీ షో

చాలా కాలం తరువాత బయటపడిన విషయం
పవన్ కళ్యాణ్, మహేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలు చాలాసార్లు వారి అభిమానుల చివరి కోరిక తీర్చేందుకు వెళ్లిన సందర్బాలు గురించి మనం మీడియా ద్వారా చాలా సార్లు తెలుసుకున్నాం. అయితే ప్రభాస్ చేసిన అలాంటి ఒక మంచి పని పెద్దగా బయటకు రాలేదు. ఇటీవల ఒక బిజినెస్ మెన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం బయటపడింది.

హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్
భీమవరం సమీపంలోని వెంప కాశీ అనే ఒక వ్యాపారవేత్త ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కు సంబంధించిన ఒక హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ గురించి బయటపెట్టాడు. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా లేకపోవడం వలన ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియలేదు. మిర్చి సినిమా సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

20 ఏళ్ల కుర్రాడికి క్యాన్సర్ అని తెలియడంతో
వెంప కాశీ మాట్లాడుతూ.. ఒకరోజు మా కజిన్ కొడుకు సడన్ గా కళ్లు తిరిగి పడిపోయాడు. కొన్ని చెకప్స్ తరువాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు తీసుకువెళ్ళాం. అయితే అతను 10రోజుల్లో చనిపోతాడు అని చెప్పారు. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉందని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అతని వయసు 20 ఏళ్ళు మాత్రమే.

ఇంకా 2గంటల్లో చనిపోతాడు అనగా..
చనిపోయే ముందు నన్ను ప్రభాస్ షూటింగ్ కు తీసుకు వెళ్ళండి అని అడిగాడు. అయితే కొంచెం ట్రీట్మెంట్ తరువాత తప్పకుండా తీసుకు వెళతాం అని చెప్పాను. నాకు ఉన్న కాంటాక్ట్స్ ద్వారా ప్రభాస్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేశాము. కానీ కుదరలేదు. అప్పుడే డాక్టర్లు బాబు ఇంకా 2గంటల్లో చనిపోవచ్చని అన్నారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం వాడి చివరి కోరిక నెరవేర్చకపోతే ఎలా అని బాధపడ్డాము.

షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని
మరోసారి ఫోన్ చేసి బ్రతిమాలి ప్రభాస్ కు విషయం తెలిసేలా చేశాము. అప్పుడు ప్రభాస్ చలించిపోయి అయ్యో ఈ విషయం ముందే నాకు ఎందుకు చెప్పలేదు అంటూ బాధపడ్డారు. ఇక షూటింగ్ లో ఉండగా అలానే మేకప్ తో డ్రెస్ కూడా మార్చుకోకుండా హాస్పిటల్ కు వచ్చాడు.

మరో 20రోజులు బ్రతికాడు
బాబుతో గంటసేపు మాట్లాడాడు. అలాగే అతన్ని ముద్దు కూడా పెట్టుకున్నాడు. నేను వెళ్ళిపొమ్మంటే గాని ప్రభాస్ వెళ్లిపోలేదు. ఇక ప్రభాస్ వెళ్లిపోగానే ఆ ఆనందంతో బాబు మరో 20రోజులు బ్రతికాడు. ఆ తరువాత బాబు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా నేను వస్తానని చెప్పండి అంటూ ప్రభాస్ ఎంతో భావోద్వేగంతో చెప్పినట్లు వెంప కాశీ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











