Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్‌మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Prabhas : హీరోయిన్ బాత్రూమ్ లో నేను లేను.. నువ్వు పాడు గజాలా.. ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో చాలా మంచి అభిప్రాయం ఉంటుంది. తనకు దగ్గరైన అందరినీ డార్లింగ్ అని పిలిచే ప్రభాస్ సాధారణంగా ప్రతి ఒక్కరిని కూడా అండి అనే పిలుస్తాడు. స్వతహాగా రాజుల కుటుంబం నుంచి వచ్చిన ప్రభాస్ ఆతిథ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని గతంలో ఎంతో మంది వెల్లడించారు. తాజాగా పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే
ఆకాష్ గ్రాండ్ లాంచ్
ప్రభాస్ పూరి జగన్నాథ్ మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేసే సమయంలో వీరిద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రభాస్ పూరి జగన్నాథ్ అంటే స్పెషల్ అటెన్షన్ చూపిస్తూ ఉంటారు.. అసలు విషయం ఏంటంటే పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.. తండ్రి దర్శకత్వంలో తప్ప ఇప్పటి దాకా హీరోగా అయితే బయట సినిమాలు చేయలేదు. ఆంధ్ర పోరి అనే ఒక సినిమా చేసాడు కానీ అప్పటికి టీనేజర్ గా ఉన్నాడు కాబట్టి అది హీరో గా లెక్క లోకి అయితే రాలేదు. ఇప్పుడు ఆకాష్ ను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు పూరి జగన్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
29న థియేటర్లలో
అందులో భాగంగానే ఆకాష్ పూరి హీరోగా ఢిల్లీకి చెందిన కేతిక శర్మ హీరోయిన్ గా రొమాంటిక్ అనే సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది.. ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే డైలాగులు వంటివి పూరి జగన్నాథ్ స్వయంగా అందించగా దర్శకుడిగా మాత్రం తన శిష్యుడు అనిల్ పాదూరి అనే వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గత మంగళవారం నాడు హీరో ప్రభాస్ ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
స్వయంగా ముందుకొచ్చి
అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ టైటిల్‌కు తగ్గట్లుగానే ట్రైలర్ చాలా రొమాంటిక్‌గా ఉందనీ, ఆకాష్ అద్భుతంగా నటించాడనీ అన్నారు. ఆకాష్ మొదటి సినిమాకీ ఇప్పటికీ చాలా పరిణతి చెందాడని, సినిమాలో ఆకాష్, కేతికా శర్మల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని అన్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్ సినిమా విడుదలని తెలిశాక ఫోన్ చేసి మరీ మూవీ గురించి ఏమన్నా ట్వీట్ వేయాలా? ఇంటర్వ్యూ ఇవ్వాలా? అని అడిగారు. ప్రభాస్ అంత మంచి వాడు'' అని కూడా ట్రైలర్ రిలీజ్ సమయంలో పూరీ చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఆకాష్ కూడా ప్రభాస్ ఈ సినిమా విషయంలో ఆయనంతట ఆయనే ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. తాను ఏదో పనిమీద ఫోన్ చేసినప్పుడు ప్రభాస్ గారు అంటే రేయ్ తంతా డార్లింగ్ అని పిలవమని ప్రభాస్ అన్నారని అంతలా ప్రభాస్ కు తనకు మధ్య బాండ్ ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే కొంత గ్యాప్ రావడంతో నేను అలా గారు అని సంబోధించా అని కానీ ప్రభాస్ దానిని కూడా సీరియస్‌గా తీసుకున్నారు అని ఆకాష్ చెప్పుకొచ్చాడు. అయితే కేవలం ట్రైలర్ రిలీజ్ చేసి ఊరుకోకుండా హీరో హీరోయిన్లతో ప్రభాస్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేశాడు. తాజాగా ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు మీడియా ప్రమోషన్స్ కోసం విడుదల చేశారు.
నేను మొగల్తూరు నుంచి వచ్చా
సాధారణంగా తెర మీద చాలా గంభీరంగా కనిపించే ప్రభాస్ ఈ ఇంటర్వ్యూ లో మాత్రం చాలా సరదాగా మనం ఊహించని విధంగా ప్రవర్తిస్తూ మాటకు మాట కౌంటర్లు వేస్తూ సందడి చేశారు. ఇంటర్వ్యూలు ప్రారంభం లోనే హీరోయిన్ ని పరిచయం చేయమని కోరగా ఆకాష్ పూరి ఈమె పేరు. కెతిక శర్మ ఢిల్లీ నుంచి వచ్చింది అని చెబుతాడు, వెంటనే కేతికశర్మ అందుకుని హాయ్ సార్ నా పేరు కేతికశర్మ నేను ఢిల్లీ నుంచి వచ్చాను అని ఇంగ్లీషులో చెప్పింది. ప్రభాస్ కూడా వెనక్కి తగ్గకుండా వెంటనే హాయ్ నా పేరు ప్రభాస్ నేను మొగల్తూరు నుంచి వచ్చాను అని చెప్పుకొచ్చాడు. అయ్యో మీ గురించి తెలియక పోవడం ఏంటి మీరు ఒక పాన్ వరల్డ్ స్టార్ ప్రపంచంలో అందరికీ మీ గురించి తెలుసు అని కేతిక శర్మ సిగ్గుపడడం కనిపిస్తోంది.
Recommended Video
నేను ఎందుకు ఆమె బాత్ రూమ్ లో
ఆ తర్వాత కేతిక శర్మ మంచి సింగర్ అని ఆకాష్ పూరి ప్రభాస్ కు చెప్పగా మా కోసం ఒక పాట పాడవచ్చు కదా అని ప్రభాస్ కోరాడు. దానికి కేతిక శర్మ మాట్లాడుతూ లేదు సార్ నాకు చాలా సిగ్గు అంటుంది. అదేంటి మొన్ననే కదా నువ్వు నా వల్ల కాదే అనే కవర్ సాంగ్ పాడావు అని ఆకాష్ పూరి అంటే నేను ఒక బాత్రూమ్ సింగర్ ను అంటుంది ఆమె. వెంటనే ఆకాష్ అందుకుని సరే ఇది నీ బాత్రూమ్ అనుకో ఇక్కడ నేను లేను, డార్లింగ్ లేడు, ఏం డార్లింగ్ నువ్వు ఉన్నావా అంటే? ఆ అమ్మాయి బాత్రూం లో నేను ఎందుకు ఉంటాను రా నేను కూడా లేను అని కళ్లు మూసుకుని, నువ్వు పాడు గజాల అని ప్రభాస్ అనడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇంటర్వూ ఆసక్తి రేపుతోంది.