ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్.. షారుఖ్, సల్మాన్‌లు డార్లింగ్ వెనకే.. టాప్ 5లో ఎవరంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇండియాలో ఏ హీరోకు లేనంత క్రేజ్, మార్కెట్ ప్రభాస్ సొంతం. ఆయన చేతిలో ప్రస్తుతం వేల కోట్ల ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్స్ కూడా ప్రభాస్ దరిదాపుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్.. త్వరలోనే సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ చిత్రాలను కూడా పట్టాలెక్కించాలని పట్టుదలతో ఉన్నారు. కొన్నేళ్ల పాటు ఆయన డైరీ ఖాళీ లేదు. తాజాగా క్రేజ్ విషయంలో ప్రభాస్ ఓ అరుదైన ఘనతను సాధించారు. ఈ వివరాల్లోకి వెళితే..
నెంబర్ వన్‌గా ప్రభాస్
దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు నటీనటుల క్రేజ్, పాపులర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన సర్వేలను వెల్లడిస్తుంటాయి. ఆర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా మే వరకు ఇండియాలో మోస్ట్ పాపులర్ మేల్ సూపర్‌స్టార్ ఎవరన్న దానిపై సర్వే నిర్వహించి ఫలితాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెంబర్ వన్‌గా నిలిచారు. బాలీవుడ్ సూపర్‌స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇతర బీటౌన్ స్టార్స్ ఎవ్వరూ కనీసం ప్రభాస్‌కు పోటీ ఇవ్వలేకపోయారు.

రాజా సాబ్‌గా ప్రభాస్
కల్కి 2898 ఏడీతో మరో 1000 కోట్ల చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఫ్యాన్ బేస్‌లో ఎలాంటి మార్పు రాలేదని ఆర్మాక్స్ తెలిపింది. త్వరలో కన్నప్ప చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు ప్రభాస్. ఈ భారీ మూవీలో రుద్రగా డార్లింగ్ నటించనున్నారు. ఇప్పటికే ప్రభాస్ లుక్, గెటప్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా.. ఇటీవల విడుదలైన కన్నప్ప ట్రైలర్‌తో అంచనాలు పెరిగిపోయాయి. ఇక మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ది రాజా సాబ్ టీజర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రభాస్ తర్వాత దళపతి
ఆర్మాక్స్ లిస్ట్‌లో ప్రభాస్ తర్వాతి స్థానంలో ఇళయ దళపతి విజయ్ నిలిచారు. తమిళనాట తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన జన నాయగన్ అనే సినిమాలో నటిస్తుండగా.. అదే తన చివరి చిత్రమని విజయ్ ప్రకటించారు. ఇకపోతే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ మూడో స్థానంలో ఉండగా.. పుష్ప 2తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నాలుగో స్థానంలో ఉన్నారు.
పుష్పతో బన్నీకి నేషనల్ వైడ్ పాపులారిటీ
పుష్ప 2తో నార్త్‌లో బన్నీకి భారీగా క్రేజ్ పెరిగింది. మారుమూల ప్రాంతాలలోనూ అల్లు అర్జున్‌కు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ కారణంతో అల్లు అర్జున్ టాప్ 5లోకి దూసుకొచ్చేశాడని సర్వే తెలిపింది. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరి టచ్ చేయని కథాంశంతో, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలోనే అట్లీ - అల్లు అర్జున్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
బాలీవుడ్‌పై సౌత్ డామినేషన్
ఇక ఈ లిస్ట్‌లో వరుసగా అజిత్ కుమార్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ నిలిచారు. మొత్తంగా ఈ లిస్ట్‌ను చూస్తే భారతీయ చిత్ర పరిశ్రమపై దక్షిణాది డామినేషన్ కనిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోలు టాప్ 10లో చోటు దక్కించుకోగా.. బాలీవుడ్ నుంచి షారుఖ్, సల్మాన్, అక్షయ్‌లు మాత్రమే స్థానం సంపాదించారు. మరి రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











