Prabhas: పాన్ ఇండియా సంస్థతో ప్రభాస్ మూడు భారీ సినిమాలు.. అవి ఎప్పుడు రిలీజ్ అంటే?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవల.. సలార్, కల్కి 2898 AD వంటి సినిమాలతో భారీ విజయం అందుకుని ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ చేశారు. వరుస విజయాలను అందుకున్న ప్రభాస్ .. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. సక్సెస్ జోష్ లో ఉన్న డార్లింగ్ ప్రభాస్.. ప్రముఖ పాన్ ఇండియా సినిమా నిర్మాణ సంస్థ తో బిగ్ డీల్ చేసుకున్నారంట. ఈ సమయంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ ఆ సినిమాలేంటీ? వాటి విడుదల ఎప్పుడనే వివరాల్లోకెళ్తే..
బాహుబలి, సలార్ , కల్కి మూవీ లతో డార్లింగ్ రేంజ్ అమాంతం పాపులర్టీ పెరిగిపోయింది. వరుస విజయాలు అందుకుని యంగ్ రెబల్ స్టార్ .. పాన్ ఇండియా హీరోగా మారారు. అదే జోష్ తో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ 'రాజా సాబ్' షూటింగ్ లో బిజీబిజీగా ఉంటారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ మూవీ తరువాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ లో నటించనున్నారు. అల్రేడీ ఈ మూవీ సెట్ పైకి వెళ్లింది. ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తరువాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్'(Spirit)మూవీ పట్టాలెక్కనున్నారు. ఇలా వరుస సినిమాలతో డార్లింగ్ ప్రభాస్ బిజీగా మారారు.

ఈ మూడు సినిమాలే కాకుండా.. కల్కి 2 భారీ బడ్జెట్ సినిమాను కూడా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పాన్ ఇండియా సినిమాలు నిర్మించే తో హీరో ప్రభాస్ భారీ డీల్ చేసుకున్నారు. ఈ డీల్ ప్రకారం ఒకటి కాదు.. రెండు కాదు . ఏకంగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకీ ఆ బడా సంస్థ ఎంటీ అని ఆలోచిస్తున్నారా? అదే.. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్ వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ (Homable Films)తో ప్రభాస్ బిగ్ డిల్ కుర్చుకున్నారట.
హోంబలే ఫిల్మ్స్ విషయానికి వస్తే.. ఈ సంస్థను విజయ్ కిరంగదూర్ స్థాపించారు. కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన 'నిన్నిందలే' అనే సినిమాను తొలుత నిర్మించింది. ఆ తరువాత 2018లో కేజీయఫ్ చిత్రాన్ని నిర్మించి.. ఇండస్ట్రీలోని పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఆ తర్వాత కాంతార, సలార్ వంటి భారీ బడ్జెట్ మూవీలను నిర్మించి భారీ విజయాన్ని అందుకుంది హోంబలే .గతంలో విడుదలైన సలార్ కోసం ప్రభాస్ తొలిసారి ఈ సంస్థతో కలిసి పనిచేశారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సలార్ కు సీక్వెల్‌గా 'సలార్ 2 రాబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి ప్రభాష్ నుంచి 2026, 2027, 2028ల్లో ఈ సినిమాలు రాబోతున్నాయి. అయితే సలార్ 2, తరువాత వచ్చే సినిమాల వివరాలను సదరు నిర్మాణ సంస్థ వెల్లడించలేదు.

వేదిక సిద్ధమైంది. ముందుకు సాగే మార్గం అపరిమితంగా ఉంటుంది. #Salaar2తో ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకే సిద్ధంగా ఉండండి," అని హోంబలే ఫిల్మ్స్ తెలిపింది. అలాగే.. "ది హోంబలే ఈజ్ కాలింగ్ ప్రభాస్" అంటూ పేర్కొంది. ఈ చిత్రాలు 2026, 2027, 2028 సంవత్సరాల్లో విడుదల అవుతాయని ముందుగానే ప్రకటించింది. అయితే.. ఇందులో 'సలార్ 2' తన మిగతా ప్రాజెక్టుల వివరాలను పేర్కొనలేదు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్ ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ ఢీల్ చేసిన ఇతర స్టార్స్ కండ్లు బైర్లు కమ్మొచ్చు అంటూ ఫ్యాన్ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











