Prabhas: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రభాస్.. ఆ సినిమాకు మళ్ళీ బ్రేక్?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ స్థాయిలో ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్నాడు. అన్నీ కూడా ప్యాన్ ఇండియా సినిమాలు కావడంతో ఏ అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ ఇటీవల ఊహించిన విధంగా కొంత అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. ఆ వివరాల్లోకి వెళితే..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు. సాహో రాధే శ్యామ్ సినిమాలో రెండు కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తదుపరి సినిమాలతో మాత్రం తప్పకుండా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో నుంచి ఆదిపూరుష్ సినిమా రాబోతోంది. రామాయణం ఆధారంగా తెరపైకి రాబోతున్న ఆ సినిమా గ్రాఫిక్స్ పనుల వల్ల కొంత ఆలస్యం అవుతుంది. కానీ ప్రభాస్ అన్ని పనులను పూర్తి చేసుకున్నాడు.

అలాగే ప్రాజెక్టు Kతో పాటు సలార్, మారుతి సినిమాలు కూడా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో వీలైనంత త్వరగా మారుతి సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం 40 రోజుల కాల్షిట్స్ ఇచ్చినట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది. అయితే ఇటీవల హఠాత్తుగా ప్రభాస్ కొత్త అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.

కొత్త జ్వరం రావడంతో ప్రభాస్ రెస్టు తీసుకోవాలి అని షూటింగ్లకు కొత్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో మారుతి తో త్వరలో స్టార్ట్ చేయాలని అనుకున్న షెడ్యూల్ కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. వరుసగా షూటింగ్స్ లలో పాల్గొంటూ ఉండటం వలన కొత్త అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అలాగే సలార్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











