Salaar నుంచి ప్రభాస్ పిక్ లీక్.. అప్పుడు టెన్షన్ పడిన వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీ.. ఎందుకంటే?

ఈ మధ్య కాలంలో తెరకెక్కుతున్న సినిమాలకు లీకేజీ టెన్షన్ పెట్టుకుంటోంది. ఎందుకంటే హీరోల గత చిత్రాల ఇమేజ్ లకు పూర్తి భిన్నంగా వాళ్ళను ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నారు. ఎలాగో సినిమా మీద ఆసక్తి రేకెత్తించడానికి సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. కానీ అంతకు ముందే సెట్స్ లో కొందరి అత్యుత్సాహం కారణంగా ముందే ఫోటోలు లీకవుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక ఫ్యాన్స్ ఒకపక్క టెన్షన్ పడుతూనే మరోపక్క ఆనంద పడుతున్నారు. ఆ వివరాలు

కమర్షియల్ ఎంట‌ర్‌టైనర్ కోసం

కమర్షియల్ ఎంట‌ర్‌టైనర్ కోసం

బాహుబలి తరువాత ప్రభాస్ కు అంతటి సాలిడ్ హిట్ పడలేదు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఎంపిక చేసుకున్న కథల పట్ల ఫ్యాన్స్ అయితే అస్సలే హ్యాపీగా లేరు. ప్రభాస్ పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంట‌ర్‌టైనర్ చేస్తే చూడాలని ఆయన అభిమానులు చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే... ఆయన అటువంటి సినిమాలలో కనిపించి చాలా రోజులు అయ్యింది.

 ఆనందంగా లేరు

ఆనందంగా లేరు


ప్రభాస్ లాస్ట్ సినిమా 'రాధే శ్యామ్' ప్యూర్ క్లాసిక్ లవ్ స్టోరీ కాగా దానికి ముందు చేసిన 'సాహో' స్టయిలిష్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ క్రమంలోనే ప్రభాస్ 'మిర్చి' లాంటి మాస్ సబ్జెక్ట్ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా ప్రభాస్ ఫాన్స్ అంత ఆనందంగా లేరు.

30 శాతం షూటింగ్ పూర్తి

30 శాతం షూటింగ్ పూర్తి


అయితే ఇప్పుడు 'సలార్' లొకేషన్ లో స్టిల్స్ లీక్ అవుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనికి కారణం 'కెజియఫ్ 2' సక్సెస్ ఒక రీజన్ అని చెప్పక తప్పదు. 'కెజియఫ్ 2' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా 'సలార్'. ఈ సినిమాకు సంబందించిన 30 శాతం షూటింగ్ పూర్తయింది.

 హ్యాపీ ఫీల్

హ్యాపీ ఫీల్


వచ్చే నెలలో ఈ సినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ కానుంది. 'కెజియఫ్ 2' విడుదల కంటే ముందే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పట్లో షూటింగ్ లొకేషన్ నుంచి ప్రభాస్ ఫోటోలు లీక్ అయ్యాయి. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి ఇలా దుమ్ములో మా హీరోను చూపిస్తున్నారు అని టెన్షన్ పడ్డారు. సినిమా యూనిట్ ముందుగానే జాగ్రత్త పడి మళ్ళీ అలా లొకేషన్ నుంచి పిక్స్ లీక్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ లీకుల బెడద మొదలైంది. అయితే, అప్పుడు టెన్షన్ పడిన ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

నిర్మాణ సంస్థ చర్యలు

నిర్మాణ సంస్థ చర్యలు


ఎందుకంటే 'కెజియఫ్ 2' విజయం తర్వాత... ప్రభాస్ అభిమానుల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎన్ని స్టిల్స్ లీక్ అయినా ప్రశాంత్ నీల్ స్టామినా వేరని, ఏమాత్రం స్టార్ డం లేని యష్ ను దేశవ్యాప్తంగా పాపులర్ చేసేస్తే ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఇంకెలా చూపిస్తాడో ఊహించుకోలేకపోతున్నామని అంటున్నారు. ఈ సినిమాను కూడా హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఈ లీక్డ్ పిక్ మీద నిర్మాణ సంస్థ చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X