twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Salaar Leaked Video : క్యాజువల్ లుక్ లో ప్రభాస్, టెన్షన్ తప్పట్లేదుగా!

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు ఒప్పుకొని బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకుని సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ప్రేక్షకులు ఆశించినంత మేర సాహో సినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత కూడా ఆయన పెద్దగా పేరులేని ఓకే సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణ అనే దర్శకుడితో రాధేశ్యాం అనే సినిమా చేస్తున్నాడు.

    ఈ రాధేశ్యామ్ సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులకు తోడు సినిమా మీద ఎక్కువ శ్రద్ధ పెట్టిన ప్రభాస్ సినిమా లేట్ అయినా పర్లేదు మంచి అవుట్ పుట్ తో ప్రేక్షకుల ముందుకు వెళ్తామని ఉద్దేశంతో ఉండడంతో సినిమా అంతకంతకూ లేట్ అవుతోంది..

    ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్నాడు.. ఇక సలార్ షూటింగ్ లో కూడా ప్రభాస్ కొన్నాళ్ళు పాల్గొనగా, షూటింగ్ సమయంలో కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అయ్యి కలకలం రేపాయి.

    prabhas looks casual in Salaar Leaked Video

    ఆ తర్వాత షూటింగ్ నుంచి ఇలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సినిమా షూటింగ్ నుంచి ఫోటోలు లీక్ కావడం సంచలనంగా మారుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు సైతం లీక్ అయినట్లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ప్రభాస్ వాడుతున్న బైక్ ఫోటో బయటకు రావడంతో ఆ బైక్ ను బేస్ చేసుకుని కధే పుట్టించేశారు కొంతమంది. ఇక ప్రభాస్ లైనప్‌లో సలార్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. ఈ సినిమాకి KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

    ఆయన క్రేజీ మాస్ సినిమాలు అందించడంలో పేరుగాంచాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ అన్నింటి కంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు. అయితే ఎప్పటిలానే సలార్ షూటింగ్ స్పాట్‌ లో ప్రభాస్ కి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ చేయబడింది. ఇక ఇది సినిమాలో సన్నివేశానికి సంబంధించినది కాదు కానీ సాలార్ షూటింగ్ స్పాట్‌లో ప్రభాస్‌కు సంబంధించినది. ఈ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    అయితే ఈ వీడియో లేటెస్ట్ వీడియోనా? కాదా అనేది క్లారిటీ లేదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమైతే అయింది కానీ ప్రభాస్ షూట్ లో పాల్గొంటున్నారా అనే దాని మీద అయితే అప్‌ డేట్ లేదు. సలార్ ఏప్రిల్ 22, 2022 కోసం సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయబడుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం, KGF 2 విడుదలై KGF లాగా హిట్ అయితే సలార్ సినిమాకి కూడా మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

    English summary
    A small video of Prabhas at Salaar shooting spot is leaked on the social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X