Prabhas: పెళ్లి చేసుకోవాలా.? వద్దా..? ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Prabhas: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ? అంటే చెప్పొచ్చు. కల్కీలో సుమతిని భైరవ ఎందుకు వెంబడిస్తాడో ? అంటే దానికి ఓ క్లారిటీ ఇవ్వచ్చు. ఆఖరికి 'స్పిరిట్'మూవీలో ప్రభాస్ ఓ పాత్రలో కనిపించబోతున్నారంటే కూడా చెప్పొచ్చు. కానీ, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం సాధ్యం కాదు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగినా.. డార్లింగ్ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్నారు. ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రికార్డ్ సృష్టించాడు. పెళ్లి ఊసే ఎత్తితే ఆమడ దూరం వెళ్లే డార్లింగ్ ప్రభాస్ తాజాగా పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డార్లింగ్ ప్రభాస్ స్పీడు చూస్తే దిమ్మ తిరిగి పోతుంది. ఆయన లైన్ అప్ చేసిన సినిమాల లిస్టు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వరస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. సలార్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు. 1000 కోట్ల పైగా కలెక్షన్ వసూలు చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇప్పుడు రాజాసాబ్ అనే హర్రర్ అండ్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

Prabhas made interesting comments about his marriage

అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటించబోతున్నారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ మూవీలో నటించబోతున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నా ప్రభాస్. తాజాగా మరో మూడు భారీ పాన్ ఇండియా సినిమాలలో నటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు కే.జి.ఎఫ్., కాంతారా వంటి భారీ హిట్లర్ అందించిన హింబలే ఫిలిమ్స్ తో బిగ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఒకే సమయంలో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫ్యాన్స్ కు కిక్కించే న్యూస్ అందించాడు. దీంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేకుండా పోయాయి.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ప్రముఖ గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి జ్ఞాపకంగా నిర్వహిస్తున్న నా ఉచ్ఛ్వాసం కవనం అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'జల్సా'లోని చలోరే చలోరే చల్‌ పాట గురించి మాట్లాడారు. ఆ పాట అంటే తనకు చాలా చాలా ఇష్టమని అన్నారు ప్రభాస్. ఏ పార్టీకి వెళ్లినా ఈ పాట గురించే మాట్లాడుకుంటాం.. నేను ఈ పాట గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ పారిపోయేవారు అని అన్నారు ప్రభాస్.

Prabhas made interesting comments about his marriage

ఈ క్రమంలోనే ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనీ అనే సినిమాలో 'భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదర్‌' పాట సీతారామశాస్త్రి రాశారా..! అందులో పెళ్లి చేసుకోవద్దని రాశారు. పెళ్లి డేంజర్ అని రాశారు. తర్వాత సినిమాల్లో పెళ్లి గురించి గొప్పగా ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా.. ? చేసుకోకూడదా.? అని నవ్వుతూ అన్నారు ప్రభాస్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ డార్లింగ్ ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచిచూడాలి.

More from Filmibeat

Read more about: prabhas kalki spirit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X