twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ కొత్త సినిమా కోసం హైదరాబాద్ లో మరో స్పెషల్ సెట్.. అక్కడే సగానికి పైగా షూట్..?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూడవ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ విడుదల కావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది అని ప్రభాస్ ప్రమోషన్లో కూడా చాలా నమ్మకంగా చెబుతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన ప్రేమ కథలు ఒక లెక్క ఇప్పుడు రాధేశ్యామ్ లో చూడబోయే ప్రేమ కథ మరొక లెక్క అనే విధంగా ప్రభాస్ ప్రతీ ఇంటర్వ్యూలో చెబుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమా విధికి ప్రేమకు జరిగే యుద్ధం అని సినిమా చాలా కొత్తగా ఉంటుందని కూడా దర్శకుడు ధైర్యంగా చెబుతున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్స్ తో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశారు.

    ఇక ఈ సినిమా హడావుడి ముగిసిన అనంతరం ప్రభాస్ వెంటనే మరో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు రాజా డీలక్స్ అని సమాచారం. కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మారుతి ప్రభాస్ తో ఒక సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మించబోయే ఆ సినిమాను ప్రభాస్ నాలుగు నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. సాధారణంగా దర్శకుడు మారుతి ఎలాంటి సినిమాను మొదలు పెట్టిన కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటాడు.

    Prabhas maruthi movie shooting first schedule in big sets

    దర్శకుడు మారుతి కూడా నాలుగైదు నెలల కంటే ఎక్కువ సమయం కూడా తీసుకోడు. ప్రభాస్ కోసమే మరింత తొందరగా సినిమా షూటింగ్ ను ఫినిష్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అయితే మారుతి రాజా డీలక్స్ సినిమా ఒక హారర్ కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక రాజా డీలక్స్ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ నిర్మాణం కూడా జరిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని లింగంపల్లి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ సెట్ ను అయితే నిర్మిస్తున్నారు. అది ప్రభాస్ మారుతి సినిమా కోసమే అని తెలుస్తోంది.

    ప్రభాస్ దాదాపు సగానికి పైగా షూటింగ్ ను అక్కడే పూర్తి చేస్తారని కూడా తెలుస్తోంది. ఇక ప్రభాస్ లైన్ లో మరో నాలుగు సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. ఆ సినిమా రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. ఇక రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమాను 2023 జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు Kను కూడా భారీ స్థాయిలో అదే ఏడాది చివర్లో తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే సందీప్ వంగా దర్శకత్వంలో కూడా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    Prabhas maruthi movie shooting first schedule in big sets,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X