Prabhas భయపెట్టే సినిమా మొదలయ్యేది అప్పుడే.. అలా సెట్ చేసిన మారుతి

రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సరైన సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో గుర్తింపు అందుకునే విధంగా ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకోలేక పోయాడు. సాహో సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇక తదుపరి సినిమాలతో ఎలాగైనా మంచి విజయాలను అందుకోవాలి అని డార్లింగ్ ప్రణాళికలు రచిస్తున్నాడు.

ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఆది పురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. వీటితోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K తో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డితో కూడా స్పిరిట్ అని ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Prabhas maruthi project latest plan and schedule release timing

ఇక వీటితో పాటు పక్కా కమర్షియల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదివరకే పక్కా కమర్షియల్ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో మారుతి ప్రభాస్ సినిమా పై ఒక క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా అభిమానులకు నచ్చే విధంగా ఒక మంచి సినిమాను అయితే తెరపైకి తీసుకు వస్తాను అని తప్పకుండా ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమా ఉంటుంది అని కూడా మారుతి తెలియజేశాడు.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలోనే స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలోనే తెరపైకి రాబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో భయపెడతాడని కూడా తెలుస్తోంది. ఎప్పటి నుంచో హారర్ కాన్సెప్ట్ లో సినిమాలు చేయాలని అనుకుంటున్న ప్రభాస్ మారుతి ఊహలకు తగ్గట్లుగానే ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకున్నాడట. మరి ఆ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా షూటింగ్ ను రెండు మూడు నెలల్లోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X