ప్రభాస్‌కు విదేశీయుల తాకిడి.. సాహోకు ముందే కీలక నిర్ణయం.. శ్రద్దా, పూజాతో కలిసి..
బాహుబలి తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ క్రేజ్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. పలు దేశాల్లో అభిమానులు పెరిగిపోయారు. సాహో టీజర్ తర్వాత విదేశీ అభిమానుల సంఖ్య పెరిగినట్టు చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా జపాన్‌లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో ఇటీవల కాలంలో ప్రభాస్ ఇంటికి విదేశీ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువైనట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

ఫారిన్ ఫ్యాన్స్ సంఖ్య
బాహుబలి1, 2 చిత్రాలకు జపాన్‌లో మంచి స్పందన లభించింది. ఆ తర్వాత ప్రభాస్‌కు అభిమానులు భారీగా పెరిగిపోయారు. ఈ మధ్య ప్రభాస్ ఇంటికి విదేశీ అభిమానుల తాకిడి ఎక్కువైందట. ఇటీవల కాలంలో ప్రభాస్ ఇంటికి వచ్చే ఫ్యాన్స్ సంఖ్య పెరిగిందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సాహో ట్రైలర్ రిలీజ్‌కు ముందు
ప్రభాస్‌ను కలుసుకోవడానికి ఈ మధ్య ఎక్కువగా విదేశీ అభిమానులు వస్తున్నారు. ప్రభాస్ తీరిక లేకపోవడం, షూటింగ్‌ల కోసం బయటకు వెళ్లడం వల్ల వారిని కలుసుకోలేకపోతున్నారు. సాహో ట్రైలర్ లాంచ్‌కు ముందు జపాన్ అభిమానులతో ఓ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నాం అని ప్రభాస్ పీఆర్ వర్గాలు వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

సాహోపైనే ప్రభాస్ దృష్టి
బాహుబలి2 రిలీజ్ తర్వాత ప్రభాస్ మూవీ రిలీజై దాదాపు ఏడాదికిపైనే అవుతున్నది. ప్రస్తుతం సాహో మూవీ విడుదలకు రెడీ అవుతున్నది. బాహుబలి కాకుండా మిర్చి మూవీ రిలీజై దాదాపు ఐదేళ్లు కావొస్తున్నది. దాంతో సాహోతో ఆ లోటును తీర్చుకోవాలని ప్రభాస్ చూస్తున్నాడనే మాట వినిపిస్తుంది. అందుకే ప్రభాస్ దృష్టంతా సాహోపైనే ఉందని పేర్కొంటున్నారు.

శ్రద్ధా కపూర్, పూజాతో ప్రభాస్
ప్రస్తుతం సాహో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతోపాటు ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేసుకొంటున్నట్టు సమాచారం. ఈ చిత్రం ద్వారా తొలిసారి బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ప్రభాస్ నటించనున్నారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











