Prabhas ఫ్యాన్స్‌కు పండుగే పండగ.. సలార్‌కు దిమ్మతిరిగే బిజినెస్.. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం సలార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ క్రేజ్‌ను, బజ్‌ను క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశ, నిరుత్సాహానికి గురయ్యారు. అయితే సలార్ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్తను చెప్పడానికి సిద్దమవుతున్నారు. ఈ వార్త వివరాల్లోకి వెళితే..
సలార్ చిత్రం వాస్తవానికి సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సింది. ఈ సినిమా కోసం ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు లెవెల్లో టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉత్తర అమెరికాలో 600K డాలర్లు అంటే.. సుమారు 5 కోట్ల రూపాయాలు వసూలు చేసింది.

అయితే సలార్ సినిమా వాయిదాపడటంతో క్రేజీగా జరగాల్సిన ప్రీ రిలీజ్ బిజినెస్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా బిజినెస్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నది. సలార్ సినిమా ఉత్తర అమెరికా థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకొన్నారనే వార్త వైరల్ అయింది.
అమెరికా, కెనడాకు సంబంధించిన సలార్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా హక్కులను 4.4 మిలియన్ డాలర్లు అంటే.. 36 కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా ఉత్తర అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 9 మిలియన్లు అంటే.. 75 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొంటున్న సలార్ సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయంపై యూనిట్ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమాను జనవరి 2024 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో సలార్ దిగితే ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ వాతావరణమే ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











