twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ కోసం స్పెషల్ హాస్పిటల్.. గృహ నిర్బంధంలోనే యంగ్ రెబల్ స్టార్..

    |

    కరోనావైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖానికి మాస్క్‌తో తన లేటేస్ట్ షూటింగ్ కోసం జార్జియా వెళ్లారు. అయితే కరోనా విజృంభించడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇంటి ముఖం పట్టారు. అప్పటి నుంచి బయట కనిపించిన దాఖలాలు లేవు. అయితే జార్జియా నుంచి వచ్చిన తర్వాత గృహ నిర్బంధంలోకి వెళ్లారు. అప్పటి నుంచి ట్వీట్లు, సమాచారం తప్పితే.. ప్రత్యక్షంగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ప్రభాస్ గురించిన ఓ వార్త ఆసక్తిని రేపింది. అదేమిటంటే..

    గృహ నిర్బంధంలో ప్రభాస్

    గృహ నిర్బంధంలో ప్రభాస్

    ఇటీవల జనతా కర్ఫ్యూ అనంతరం సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు మీడియాకు సమాచారం ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత అధికారులకు సమాచారం ఇచ్చి ప్రభాస్ ఇప్పుడు గృహ నిర్బంధంలో ఉన్నారు. అధికారులకు సహకరిస్తున్నారు అని ఆయన వివరించారు. దాదాపు 14 రోజులపాటు సోషల్ డిస్టెన్స్ పాటిస్తారని చెప్పారు.

    సినీ పరిశ్రమకు భారీగా విరాళం

    సినీ పరిశ్రమకు భారీగా విరాళం

    ఇక కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటించడంతో సినీ పరిశ్రమ పూర్తిగా మూతపడింది. థియేటర్లు, షూటింగులు నిలిపివేయడంతో సినీ కార్మికులు రోడ్డున పరిస్థితి కనిపించింది. దాంతో సినీ పరిశ్రమ స్పందించి ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసింది. దాంతో ప్రభాస్ సుమారు 4 కోట్లకుపైగా ఆర్థిక సహాయాన్ని అందించి ప్రజలను, సినీ కార్మికులను ఆదుకొనే ప్రయత్నం చేశారు.

    మూవీ షూటింగ్ గురించి ప్లాన్స్

    మూవీ షూటింగ్ గురించి ప్లాన్స్

    ఇక ప్రభాస్ ఓ వైపు ప్రజల క్షేమం గురించి ఆలోచించినా.. ఆయన దృష్టంతా దర్శకుడు రాధాకృష్ణ రూపొందించే సినిమాపైనే ఉంది. తన సినిమా షూటింగ్ గురించి చిత్ర యూనిట్‌తో చర్చలు జరుపుతున్నారనేది తాజా సమాచారం. అయితే లాక్‌డౌన్ ఎత్తేసి షూటింగ్‌లు మొదలుపెట్టే సమయానికి అంతా సిద్ధంగా ఉండాలని ప్రభాస్ దర్శక, నిర్మాతలతో తన అభిప్రాయాన్ని పంచుకొన్నట్టు తెలిసింది.

    Recommended Video

    Prabhas In Trouble, Prabhas20 Film Shooting Held in Georgia
    లాక్‌డౌన్ ఎత్తి వేయగానే..

    లాక్‌డౌన్ ఎత్తి వేయగానే..

    ప్రభాస్ తన సినిమా కోసం పక్కాగా ప్లానింగ్ చేస్తున్నారనేది ఈ సమాచారంతో అర్ధమైంది. రాధాకృష్ణ రూపొందించే సినిమా కోసం హాస్పిటల్ సెట్‌ను రూపొందించే పనిలో యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు యుద్ధ ప్రతిపాదికన చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.

    English summary
    Prabhas movie shoot stalled amid Coronavirus. Now, A latest update comes into the media circles that. a special set in Annapurna Studo for Radha Krishna movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X