Prabhas: ఇది కదా అసలైన బర్త్‌డే ట్రీట్.. ఏకంగా ఆరు సినిమాలు రీ రిలీజ్ !

Prabhas Birth Day special: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుంది. స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీస్ ను రీ-రిలీజ్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అదే సమయంలో రీ-రిలీజ్ లో కలెక్షన్ ల్లో కూడా రికార్డులు చేస్తున్నారు. ఈ రీ-రిలీజ్ ట్రెండ్‌ను సద్వినియోగం చేసుకుని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా స్టార్ హీరోస్ సినిమాలను విడుదల చేస్తున్నారు. వచ్చే వారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి మూవీ మేకర్స్ సిద్దమయ్యారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ ఏంటో ఓ లూక్కేయండి.

వచ్చే వారంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు జరుగబోతున్నాయి. ఈ క్రమంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ సందడి చాలా జోరుగా సెలబ్రెషన్స్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు గ్రాండ్ గా బర్త్ డే ట్రిట్ ఇవ్వాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలను ఎన్ని సార్లు వచ్చిన చూస్తారు ఫ్యాన్స్.
ఈ క్రమంలో ప్రభాస్ ఆరు మూవీస్ ను రీ రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ చేయాలని భావిస్తున్నారు.

Prabhas movies re release Mr Perfect Mirchi Chhatrapati Eshwar Rebel Salaar are being re-released as a birthday gift for Prabhas

ఇక ప్రభాస్ రీ రిలీజ్ మూవీస్ విషయానికి వస్తే.. 'డార్లింగ్ (Darling)' సినిమా సెప్టెంబర్ 23న రీ-రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీ 2010లో విడుదలైంది. కామెడీ-రొమాంటిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్‌గా కాజల్ నటించింది. అ సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా డార్లింగ్ మూవీ సెప్టెంబర్ 23న రీ రిలీజ్ కానున్నది.

ప్రభాస్ బర్తేడ్ కానుకగా.. 'మిస్టర్ పర్ఫెక్ట్ (Mr. Perfect)'మూవీని ఈ నెల 22న రీ రిలీజ్ చేయబోతున్నామని ప్రొడ్యూసర్ దిల్ రాజు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. మరోవైపు.. బర్త్ డే నాడు ప్రభాస్ డెబ్యూ మూవీ 'ఈశ్వర్' రీ రిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు 2002లో విడుదలైన 'ఈశ్వర్ (Eshwar)' సినిమాలో ప్రభాస్ సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించింది.

Prabhas movies re release Mr Perfect Mirchi Chhatrapati Eshwar Rebel Salaar are being re-released as a birthday gift for Prabhas

ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపాడానికి మిర్చి (mirchi), రెబెల్ (rebal)మూవీని ఈ నెల 23న రీ రిలీజ్ చేయనున్నారు. అలాగే.. 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'(salar part1) సినిమాను ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్ లో స్పెషల్ షోలు వేయబోతున్నారు. ఉదయం ఆటలు బుక్ మై షోలో పెట్టగానే క్షణాల్లో సోల్డ్ అవుట్ అయ్యాయంటే.. ప్రభాస్ ఫ్యాన్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ కొత్త సినిమాలైన.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న 'రాజా డీలక్స్', సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్', హను రాఘవాపుడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజీ నుంచి కూడా అప్టేట్స్ కూడా వచ్చే అవకాశముందట. ఇక అప్ కమింగ్ మూవీ విషయానికి వస్తే.. 'కల్కి 2' అలాగే 'సలార్ 2'కూడ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయంట. ఇలా ప్రభాస్ సినిమాల నుండి అప్డేట్స్ రావడంతో పాటు, ఆయన నటించిన సినిమాలు రీ-రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23)ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: prabhas mirchi rebel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X