twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్స్ కేసుల గోల.. ప్రభాస్‌ని మాత్రం వదిలిపెట్టేలా లేరు, మరీ ఇంత దారుణమా?

    |

    ఇంటర్నెట్ ప్రపంచం రోజురోజుకి ఉహాలకందని రీతిలో అప్డేట్ అవుతోంది. అయితే ఆ అభివృద్ధిని చూసి సంతోషపడాలో లేక బాధపడలో అర్థం కావడం లేదని అంటున్నారు చాలా మంది. సెలబ్రెటీలకు సోషల్ మీడియా డీజిటల్ మీడియా అనేది ఒక స్పెషల్ ఫ్లాట్ ఫార్మ్ అయినప్పటికీ కొన్నిసార్లు వాటివల్ల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ప్రస్తుతం డ్రగ్స్ కేసులలో ఎవరో ఇరుక్కుంటే ప్రభాస్ పేరును కూడా ఊహించని విధంగా ఇరికించేస్తున్నారు.

    డ్రగ్స్ వార్తల్లో ప్రభాస్ పేరు..

    డ్రగ్స్ వార్తల్లో ప్రభాస్ పేరు..

    బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా క్రేజ్ అందుకోవడంతో అన్ని భాషల వారి ఫోకస్ అతనిపై పడింది. అందుకే కాంట్రవర్సీ టాపిక్స్ తో రెబల్ స్టార్స్ కి ఏ మాత్రం లింకు ఉన్నా మొహమాటం లేకుండా ఆయన ఇమేజ్ ని వాడేసుకుంటున్నారు. కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వివాదంలో కూడా ప్రభాస్ నేమ్ ట్రెండ్ అవుతోంది.

    ఆ రెండు వివాదాల్లో ప్రభాస్

    ఆ రెండు వివాదాల్లో ప్రభాస్

    మరోవైపు కంగనా రనౌత్ వివాదంలో కూడా ప్రభాస్ పేరు వచ్చేస్తోంది. యూ ట్యూన్ లో అలాగే కొన్ని వెబ్ సైట్ లలో థంబ్ నెయిల్ కోసం ప్రభాస్ ని గట్టిగా వాడేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ప్రభాస్ హీరోయిన్, ప్రభాస్ హీరోయిన్ బంగ్లాను కూల్చివేసిన అధికారులు అంటూ అనేక రకాల హెడ్డింగ్ లు, థంబ్ నెయిల్స్ వైరల్ అవుతున్నాయి.

    ఆ హీరోయిన్స్ ప్రభాస్‌తో నటించినందుకు

    ఆ హీరోయిన్స్ ప్రభాస్‌తో నటించినందుకు

    ఇటీవల కన్నడ సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజాన గల్రాని ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక పొలిటికల్ వర్స్ తో వార్తల్లో నిలిస్తున్న కంగనా రనౌత్ కూడా ప్రభాస్ తో అప్పట్లో ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది. ఇక ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది పూరి జగన్నాథ్ కావడం విశేషం అనే కథనాలు కూడా షాక్ ఇస్తున్నాయి.

    అదే పెద్ద పాపమైపోయింది..

    అదే పెద్ద పాపమైపోయింది..

    ఏదేమైనా ప్రభాస్ తో వాళ్ళు నటించడమే పెద్ద పాపమైపోయింది. కాంట్రవర్సీ గాలి కూడా తాకకుండా జాగ్రత్తగా ఉండే ప్రభాస్ ని ఈ గొడవల్లో గట్టిగా వాడుతున్నారు. ఏ రేంజ్ లో వాడుతున్నారంటే గూగుల్ సెర్చ్ లో ప్రభాస్ పేరు కొడితే క్రైమ్ న్యూస్ లు ఎక్కువగా వచ్చే స్థాయిలో వాడుతున్నారు.

    Recommended Video

    Prabhas Adopts Forest Land ప్రభాస్ భారీ విరాళం | Green Revolution
    మంచి అప్డేట్స్ ఇచ్చినా కూడా.. అవే వార్తలు

    మంచి అప్డేట్స్ ఇచ్చినా కూడా.. అవే వార్తలు

    ఇటీవల ప్రభాస్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో పాటు అడవులను దత్తత తీసుకోవడం వంటి వాటితో అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ సంజనా, కంగనా వివాదాల్లో ప్రభాస్ పేరును వాడుతూ ఆ న్యూస్ లను హైలెట్ చేస్తున్నారు. మరి ఈ విషయం ఎప్పటివరకు వైరల్ అవుతుందో చూడాలి.

    English summary
    The much awaited Prabhas 20th movie First Look has finally been released. UV Creations, which has been making fans a little impatient for years due to delays, got a good kick out of the whole first look. The title of Radheshyam has been fixed for the movie as everyone expected. The First Look title is currently trending on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X