ప్రభాస్ లుక్ ట్రెండింగ్.. ఈ మార్పుకు కారణం అదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రోజు ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో ప్రభాస్ ని చూసి ఆయన అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. మరి ప్రభాస్ లో ఈ మార్పు రావడానికి కారణం ట్రోల్సా? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.
ప్రభాస్ అనగానే ఆరడుగుల కటౌట్ గుర్తొస్తుంది. అలాగే సెట్లో తరతమ బేధం లేకుండా కడుపు నిండా భోజనం పెట్టే రాజు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన స్టార్ హీరో గుర్తొస్తాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పాన్ ఇండియా రేంజ్ కి మారిపోయింది. కానీ ఈ భారాన్ని మోయడం ప్రభాస్ కి చాలా కష్టంగా మారింది.

ఫలితంగా దారుణమైన నెగెటివ్ కామెంట్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. గత ఏడాది సలార్ తో బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ ఈ మూవీ చెప్పుకోదగ్గ లాభాలను మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది. ఇక ఈ మధ్యలో ప్రభాస్ చేసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడం, ప్రభాస్ లుక్స్ పై ట్రోల్స్ జరగడం వంటి ఎన్నో దారుణమైన సంఘటనలను ప్రభాస్ తో పాటు ఆయన అభిమానులు కూడా భరించాల్సి వచ్చింది.
నిజానికి చేతి నిండా సినిమాలు ఉండడంతో ప్రభాస్ రాత్రింబవళ్ళు సెట్ లోనే కష్టపడాల్సి వచ్చింది. ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా టైం కేటాయించలేకపోవడంతో ప్రభాస్ బయట ఎక్కడ కనిపించినా దారుణంగా ట్రోల్ చేశారు ప్రభాస్ హేటర్స్. కానీ తాజాగా కల్కి ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులతో పాటు ఆయనపై ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా నోళ్లు వెళ్లబెట్టేలా అద్భుతమైన లుక్ లో కనిపించాడు.

ఈ ఈవెంట్లో ప్రభాస్ తో పాటు బేబీ బంప్ తో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి బడా హీరోలు ఉన్నప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ప్రభాస్ గణనీయంగా బరువు తగ్గడమే. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు స్టైలిష్ గా కూడా కనిపించాడు. ఈ వేడుకలో ప్రభాస్ ఎంత స్లిమ్ గా కనిపించాడంటే దాదాపు మిర్చి సినిమాలో ఆయన లుక్ గుర్తొచ్చింది. ఇక హెయిర్ స్టైల్ తో పాటు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడంటే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అనే ఆయన ఇమేజ్ కు డార్లింగే పర్ఫెక్ట్ అన్పించింది.
అంతే కాదు ఆయన ముఖంలో గ్లో కూడా తిరిగి వచ్చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ కొంచెం కూడా బాగా లేవని కంప్లైంట్ చేసిన వారందరి నోర్లు ఒక్కసారిగా మూతపడ్డాయి. ఇక ముందు ముందు కూడా ప్రభాస్ ఇలాగే తన ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ వెళ్తే డార్లింగ్ ఫ్యాన్స్ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కాలర్ ఎగరేసుకొని తిరగడం పక్కా. కాగా ఇండియాలోనే కాస్ట్లీ మూవీగా రూపొందిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27 న థియేటర్లలోకి రాబోతోంది.


Click it and Unblock the Notifications











