Prabhas: ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ సూపర్.. ఫ్యాన్స్ ఫిదా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సార్ట్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా షూటింగ్ పూర్తికాకముందే మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేంత బిజీ షెడ్యూల్‌లో గడుపుతున్నారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తన సినిమాలను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తున్నారు. అయితే వరుస షూటింగ్‌ల కారణంగా ప్రభాస్ ఇటీవల కాలంలో పెద్దగా పబ్లిక్‌లో కనిపించలేదు. కానీ, తాజాగా మరోసారి తన కొత్త లుక్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాజాగా ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరలవుతోంది.

ప్రస్తుతం ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన సందీప్ వంగా, ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని రేంజ్‌లో చూపించబోతున్నారని సమాచారం. అందుకే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Prabhas New Look Goes Viral Fans Call It Vintage Darling Ahead of Spirit Shoot

ఇక 'స్పిరిట్' సినిమాను టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ మెటీరియల్, ఆడియో టీజర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఇండస్ట్రీ ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసి, 2027 మార్చి 5న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'స్పిరిట్' నుంచి పవర్‌ఫుల్ గ్లింప్స్ లేదా టీజర్ విడుదల చేయబోతున్నట్టు టాక్.

ఇదిలాఉంటే.. ప్రభాస్.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ షూటింగ్ సమయంలో ఓ హెయిర్ స్టైలిస్ట్‌తో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో ప్రభాస్ కనిపించిన తీరు చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. బ్లాక్ టీషర్ట్, లాంగ్ హెయిర్, స్టైలిష్ గడ్డం, స్లిమ్ ఫిజిక్‌తో ప్రభాస్ చాలా ఫ్రెష్‌గా కనిపించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ప్రభాస్ లుక్స్‌పై వస్తున్న విమర్శలకు ఈ ఫోటో సమాధానం చెప్పినట్టుగా అభిమానులు భావిస్తున్నారు. ఒకప్పుడు 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'మిర్చి' సినిమాల్లో కనిపించిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ ప్రభాస్‌ను ఈ ఫోటో గుర్తు చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

"డార్లింగ్ ఈజ్ బ్యాక్", "వింటేజ్ ప్రభాస్ రీటర్న్స్", "ఏమున్నాడ్రా బాబు", "ఇదే మా పాత ప్రభాస్" అంటూ అభిమానులు కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ బరువు తగ్గి మరింత ఫిట్‌గా కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో కంటే మరింత స్లిమ్‌గా, యంగ్‌గా కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కొత్త లుక్ ఏ సినిమా కోసం అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. కొందరు అభిమానులు ఇది ప్రస్తుతం తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా లుక్ కావచ్చని భావిస్తుంటే, మరికొందరు 'కల్కి' ఫ్రాంచైజీ లేదా ఇతర ప్రాజెక్ట్‌ల కోసం సిద్ధమవుతున్న లుక్ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది ఎక్కువగా 'స్పిరిట్' చిత్రానికే సంబంధించిన లుక్ కావచ్చనే చర్చ సాగుతోంది. అయితే.. ప్రభాస్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'వింటేజ్ డార్లింగ్' లుక్ మళ్లీ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు అందరి దృష్టి 'స్పిరిట్'పై పడింది. ఈ లుక్ నిజంగానే ఆ సినిమా కోసమే అయితే, ప్రభాస్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X