వైరల్ అవుతున్న ప్రభాస్ న్యూలుక్.. గడ్డం, మీసాలు తీసేసి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబందించిన ఏ వార్త అయినా క్రేజీగా మారుతోంది. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూపులు ఆగడంలేదు. బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి మరో చిత్రం రాలేదు. బాహుబలితో ప్రభాస్ జాతీయ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సాహో తరువాత ప్రభాస్ నటించే బోయే చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ కొత్త లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారుతోంది.

జిల్ దర్శకుడితో
యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ తదుపరి చిత్రం ఉండబోతోంది. రాధాకృష్ణ 2015 లో విడుదలైన జిల్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత ఈ దర్శకుడి నుంచి మరో చిత్రం రాలేదు. ఈ గ్యాప్ లో రాధాకృష్ణ ప్రభాస్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశాడు.

ప్రేమ కథతో
ఇటీవలే ప్రభాస్, రాధాకృష్ణ చిత్రం లాంచ్ అయింది. ప్రభాస్, పూజ హెగ్డే ఈ చిత్రంలో జంటగా నటించనున్నారు. 1970 కాలం నటి ప్రేమ కథతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

కొత్త లుక్
ఈ చిత్రం కోసం గడ్డం, మీసాలు లేకుండా ప్రభాస్ క్లీన్ షేవ్ లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటలీలోని షూటింగ్ లొకేషన్ నుంచి ఈ ఫోటో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఈ ఫోటోని విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

త్వరలో పూజ హెగ్డే
పూజ హెగ్డే కూడా త్వరలో ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగులో వరుసగా క్రేజీ స్టార్స్ తో నటిస్తుండడం విశేషం. ఎన్టీఆర్ సరసన నటించిన అరవింద సమేత చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ సరసన మహర్షి చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ సినిమాతో కలిపి 3 భారీ చిత్రాలు ఏ అమ్మడి చేతిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











