అంత తొందరెందుకు.. నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ కోసం ప్రభాస్ సేఫ్ గేమ్!
ఊహించని విధంగా దేశవ్యాప్తంగా విస్తరించిన కరోనా సినిమా ఇండస్ట్రీలను మాత్రం కోలుకోలేని దెబ్బ కొడుతోంది. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల ఫ్యూచర్ ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సినిమా విడుదల లేటయితే తీసుకున్న అప్పుల వడ్డీలు ఎక్కువవుతాయి. ఎటూ తేల్చుకోలేక చాలా మంది నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు.
ఇకపోతే ఇలాంటి సమయంలో ప్రభాస్ ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ లాక్ డౌన్ కంటే ముందే వివిధ రకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఆ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ అప్పుడు కూడా కారోన్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.

వీలైనంత వరకు కరోనా పూర్తిగా తగ్గిన తరువత తన సినిమాను రిలీజ్ చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో పెద్ద సినిమాలు రిలీజ్ కాకుంటే అప్పుడు రావాలని లేదంటే.. నెక్స్ట్ ఇయర్ దసరాకి అయినా ఒక డేట్ ని ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నాడట. మిగతా సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న తరువాతే తన సినిమా రికిజ్ డేట్ ని రిలీజ్ చేయాలని ప్రభాస్ ఒక సేఫ్ జోన్ లో ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











