సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్
ప్రభాస్ అంటే కేవలం టాలీవుడ్ హీరో అనే కాదు. బహుబలితో పాన్ ఇండియా హీరోగా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. బాలీవుడ్ లో అయితే బాహుబలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న రెబల్ స్టార్ సాహో సినిమాతో కూడా అక్కడ బాగానే వసూళ్లను అందుకున్నాడు. దీంతో ప్రభాస్ కు నార్త్ లో సోలో మార్కెట్ దక్కిందని అర్ధమయ్యింది.
ఇక నెక్స్ట్ సినిమాలను బాలీవుడ్ లో ఇంకా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ కు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తో కలిసి ఆదిపురుష్ సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో మరో రికార్డును అందుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే 6 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు.

గత ఏడాది ఇదే సమయానికి 4మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్న ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినప్పటికీ ఈజీగా 6 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్నడు. ఇక ప్రభాస్ నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాను జూలై 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. అనంతరం ఆదిపురుష్ సినిమాతో పాటు సలార్ సినిమాలతో బిజీ కానున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











