యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌కు షాక్: రేసు నుంచి తప్పుకున్న ప్రభాస్!

By Manoj

తెలుగుతో పాటు ఇతర భాషల్లో పాపులారిటీని దక్కించుకున్న హీరోలు టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ జాబితాలోని నేటి తరం హీరోలను వేళ్లపై లెక్కించవచ్చు. అలాంటి వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరును ప్రముఖంగా చెప్పుకుంటారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయ్యాడు. కొన్నేళ్లుగా భారీ చిత్రాలను చేస్తూ యూనివర్శల్ స్టార్‌గా మారాడు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులను నిరాశ పరిచే ఓ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

 ప్రభాస్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది అదే

ప్రభాస్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది అదే

కెరీర్ ఆరంభం నుంచి ఓ మోస్తరు బడ్జెట్ మూవీలనే చేశాడు ప్రభాస్. ఈ క్రమంలోనే ఎన్నో జయాపజయాలను చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడిన ప్రభాస్... మంచి ఫలితాన్ని కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి అతడి క్రేజ్ ఖండాతరాలు దాటిపోయింది.

 ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులకు చేరువయ్యాడు

ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులకు చేరువయ్యాడు

‘బాహుబలి'తో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇక, ఆ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో'తో వాళ్ల హృదయాలు గెలుచుకున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా తెలుగులో విజయం సాధించలేకపోయినప్పటికీ.. హిందీలో మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది.

అదే నమ్మకంతో మరో పాన్ ఇండియా మూవీ

అదే నమ్మకంతో మరో పాన్ ఇండియా మూవీ

వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ప్రభాస్ గత చిత్రాల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.

తొలిసారి ఆ తరహా పాత్రలో యంగ్ రెబెల్ స్టార్

తొలిసారి ఆ తరహా పాత్రలో యంగ్ రెబెల్ స్టార్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్నాడట. 1960 దశకం నాటి ప్రేమకథతో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌తో ప్రభాస్‌కు సుదీర్ఘమైన రొమాన్స్ ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

 ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు.. నిర్మాణ సంస్థపై దాడి

ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు.. నిర్మాణ సంస్థపై దాడి

ప్రభాస్ సినిమాలు అంటే ఎంతో ఆలస్యం అవుతుంటాయన్న అపవాదు ఉంది. అందుకే ఈ సినిమానైనా వీలైనంత త్వరగా విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. అదే సయమంలో ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ ఇవ్వడం లేదని నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Mahanati Director Nag Ashwin On Liquor Selling In Theatre & Multiplexes
రేసు నుంచి ప్రభాస్ ఔట్.. ఏడాది పాటు ఖాళీనే.!

రేసు నుంచి ప్రభాస్ ఔట్.. ఏడాది పాటు ఖాళీనే.!

ఇప్పటికే సినిమా ఆలస్యం అవుతోందని బాధ పడుతున్న ప్రభాస్ అభిమానులను షాక్‌కు గురి చేసే మరో న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీ 2020లో విడుదల కావడం లేదట. అంతేకాదు, 2021 ఏడాది ప్రథమార్థంలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని సమాచారం. దీంతో 2020తో పాటు సంక్రాంతి రేసు నుంచి ప్రభాస్ వెళ్లిపోయాడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X