ప్రభాస్ కోసం కళ్లు చెదిరిపోయే భారీ సెట్.. ఆ దేశాన్ని ఇక్కడికి తెచ్చేలా..

By Manoj

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న హీరో. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న సినిమాల్లోనే నటించినప్పటికీ... చాలా హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోవడంతో పాటు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక, కొన్నేళ్లుగా బడా ప్రాజెక్టులతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదిలాఉండగా.. తాజాగా ప్రభాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది.

ఆ ఒక్కటే ప్రభాస్ సినీ కెరీర్‌ను మార్చేసింది

ఆ ఒక్కటే ప్రభాస్ సినీ కెరీర్‌ను మార్చేసింది

అప్పటి వరకు ఓ మోస్తరు సినిమాలతో స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగు సినీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. అలాగే, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచేసింది.

ఇక్కడ షాకిస్తే... వాళ్లంతా ‘సాహో’ అన్నారు

ఇక్కడ షాకిస్తే... వాళ్లంతా ‘సాహో’ అన్నారు

‘బాహుబలి' వంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత ప్రభాస్ ‘సాహో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో పరాజయం పాలైంది. కానీ, హిందీలో మాత్రం సూపర్ హిట్ అయింది. అంతేకాదు, భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది. దీంతో ప్రభాస్ ఉత్తరాది హీరోలకు పోటీ అయిపోయాడు.

ప్రభాస్ సరికొత్త ప్రయోగం.. ఓ డియర్ అంటూ..

ప్రభాస్ సరికొత్త ప్రయోగం.. ఓ డియర్ అంటూ..

ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఎంతో ప్రతిష్టాత్మంగా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్.. తనలోని రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాకు ‘ఓ డియర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

భారీగా ప్లాన్ చేశారు... అందుకే అలా జరిగింది

భారీగా ప్లాన్ చేశారు... అందుకే అలా జరిగింది


ఈ సినిమాను కూడా తన గత చిత్రాల మాదిరిగానే హిందీలోనూ విడుదల చేయబోతున్నాడు యంగ్ రెబెల్ స్టార్. అందుకోసం ఈ ప్రాజెక్టుకు కూడా భారీగా బడ్జెట్ కేటాయించారు. మొదట తెలుగులో మాత్రమే తీయాలనుకున్నా.. ‘సాహో'కు హిందీలో వచ్చిన రెస్పాన్స్ చూసి.. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతో రిచ్‌గా రూపొందిస్తున్నారు.

ప్రభాస్‌కు ఊహించని కష్టం.. ఏం జరుగుతుంది.?

ప్రభాస్‌కు ఊహించని కష్టం.. ఏం జరుగుతుంది.?

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరిగింది. అయితే, కరోనా కారణంగా దాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఒకవేళ లాక్‌డౌన్ పూర్తయినా... ఆ దేశానికి వెళ్లేందుకు చిత్ర యూనిట్‌కు పర్మీషన్ రాకపోవచ్చు. ‘ఓ డియర్' ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలే లేవని అంటున్నారు. దీంతో ప్రభాస్‌తో పాటు చిత్ర యూనిట్ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నారు.

Recommended Video

Rana Daggubati Engaged To Miheeka Bajaj| Tollywood Funniest Wishes
ప్రభాస్ కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ పూర్తైన వెంటనే

ప్రభాస్ కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ పూర్తైన వెంటనే


తన సినిమా విషయంలో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... మిగిలిపోయిన షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జార్జియా నగరాన్ని పోలిన భారీ సెట్ వేయబోతున్నారట. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేసేందుకే యంగ్ రెబెల్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X