తొలిసారి కష్టమైంది.. ఆమె ట్రైనింగ్‌తో ఆ సమస్య తీరింది.. ప్రభాస్

Recommended Video

Prabhas Talks About Learning Hindi For His Upcoming Movie Saaho || Filmibeat Telugu

యంగ రెబల్‌స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం సాహో. బాహుబలి సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం దేశంలోని పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. ప్రధానంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. కాగా, హిందీ భాషలో డైలాగ్స్ గురించి, భాషా ప్రధానమైన సమస్యను ఎలా అధిగమించారనే విషయాన్ని ప్రభాస్ ఇటీవల మీడియాకు వెల్లడించారు. ప్రభాస్ తెలియజేసిన వివరాలు ఏమిటంటే..

సాహో చిత్రంలో హిందీ డైలాగ్స్

సాహో చిత్రంలో హిందీ డైలాగ్స్

సాహో చిత్రం హిందీ భాషలో కూడా రూపొందడంతో సినిమాలోని హిందీకి సంబంధించి హోంవర్క్ చేశాను. హిందీలో డైలాగ్స్ గురించి అవగాహన ఏర్పరుచుకొన్నాను. డబ్బింగ్‌లో ఎలాంటి సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. నాకు భాష గురించి తెలుసు. హిందీ రాయడం, చదవడం వచ్చు. కాకపోతే మాట్లాడటం రాకపోవడం కష్టంగా అనిపించింది అని ప్రభాస్ తెలిపారు.

హిందీ టీచర్ ట్రైనింగ్‌తో

హిందీ టీచర్ ట్రైనింగ్‌తో

దేశవ్యాప్తంగా ఉన్న అన్నివర్గాల ప్రేక్షకులను సాహో ఆకట్టుకొంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కథాకు అంత గొప్పగా ప్రాధాన్యం ఉంది. నాకు సంబంధించి హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ కాకపోవడం కొంత కష్టం అనిపించింది. దాని కోసం ముందే ప్రిపరేషన్ మొదలుపెట్టాను. డైలాగ్స్ అర్థం కావడానికి సోని అనే టీచర్‌ను ట్యూటర్‌గా పెట్టుకొన్నాను. నెలరోజుల శిక్షణతో భాషపై పట్టు సాధించాను అని ప్రభాస్ వెల్లడించారు.

తొలి షెడ్యూల్‌లో కష్టమని

తొలి షెడ్యూల్‌లో కష్టమని

తొలి షెడ్యూల్ హిందీ డైలాగ్స్ కష్టమనిపించాయి. రెండో షెడ్యూల్ నుంచి గాడిలో పడ్డాను. ఇప్పుడు హిందీలో డబ్బింగ్ చెప్పే స్థాయికి భాషలో నైపుణ్యం సంపాదించుకొన్నాను. ఇప్పుడు హిందీ భాషను పర్‌ఫెక్ట్‌గా మాట్లాడుతున్నాను. కొద్ది రోజుల్లో మరింత ఫర్‌ఫెక్ట్‌గా హిందీపై పట్టు సాధిస్తాను అని ప్రభాస్ వెల్లడించారు.

సాహో మూవీ తర్వాత

సాహో మూవీ తర్వాత

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ పూర్తి సమయాన్ని సాహో కోసమే వెచ్చించారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడని స్పై థ్రిల్లర్‌గా సాహోను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. సాహో చిత్రం ద్వారా శ్రద్ధాకపూర్ తెలుగులోకి ప్రవేశించనున్నారు. సాహో రిలీజ్ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X