ఆ ప్రాజెక్ట్ కోసం 200రోజుల మాత్రమే.. డేట్స్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రభాస్ కెరీర్ మొదటి నుంచి కూడా ఈ రేంజ్ లో ఒకేసారి పెద్ద సినిమాలను సెట్స్ పై ఉంచలేదు. బాహుబలితో దాదాపు 5 ఏళ్ళు గడిపిన డార్లింగ్ ఇప్పుడు మాత్రం నాలుగు సినిమాలతో బిజీగా మారాడు. ఒకే ఏడాదిలో నాలుగు రకాల డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్ ను మెయింటైన్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు.
తీరిక లేకుండా కష్టపడుతున్న ప్రభాస్ ఒక్కో సినిమాకు 100కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక అన్ని సినిమాలకు సంబంధించిన డేట్స్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలికి అయితే ప్రభాస్ డేట్స్ ఇన్నే ఇస్తాను అని కమిట్మెంట్ అయితే తీసుకోలేదు. ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేవరకు కూడా రాజమౌళితోనే ట్రావెల్ అయ్యాడు. ఇక ఇప్పుడు చేస్తున్న నాలుగు సినిమాలకు కూడా కమిట్మెంట్స్ ప్రకారమే వెళుతున్నట్లు సమాచారం.

ఇక ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు Kను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన డేట్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కరెక్ట్ గా 200 రోజుల డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక మధ్యమధ్యలో మిగతా సినిమాలను కూడా ఫినిష్ చేసుకునేలా షెడ్యూల్ ప్లాన్ సిద్ధమైనట్లు సమాచారం. దీంతో నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ కు ఉండే టైమ్ ను బట్టి వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్ లో రూపొందుతున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను అశ్వినిదత్ నిర్మిస్తున్నారు. ఇక 2024లో మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











