ప్రభాస్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో తొలి పోస్ట్ పడింది... 1 మిలియన్ దిశగా!

Recommended Video

Baahubali Star Prabhas Posted His First Ever Picture On Instagram On Wednesday || Filmibeat Telugu

బాహుబలి స్టార్ ప్రభాస్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. అయితే అందులో ఎలాంటి పోస్ట్ పెట్టకుండానే దాదాపు 8 లక్షలకుపైగా ఫాలోవర్స్ కావడం హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ అంటే ఇష్టపడే అభిమానులు ఎంత మంది ఉన్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం.

'బాహుబలి', 'బాహుబలి-2' సినిమాల ఎఫెక్టుతో ప్యాన్ ఇండియా వైడ్ యంగ్ రెబల్ స్టార్స్ ఫాన్స్ సంఖ్య బాగా పెరిగింది. ప్రభాస్ అంటే ఇష్టపడే వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉండటం గమనార్హం. అందుకే అతడు ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేయగానే అదో సంచలనం అయింది.

తొలి పోస్ట్ పడింది

ఎట్టకేలకు ప్రభాస్ తన ఇన్‌స్టా అకౌంట్లో తొలి పోస్ట్ పెట్టారు. బాహుబలిలో కత్తి యుద్ధం చేస్తున్న స్టిల్ షేర్ చేశారు. ఈ పిక్ పెట్టిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్ వచ్చిపడ్డాయి. అభిమానులు తాము ఇన్‌స్టాలో పెట్టే ప్రతి పోస్టుకు ప్రభాస్‌ను ట్యాగ్ చేస్తుండటంతో ఇది వైరల్ అవుతోంది.

ట్రెండ్ ఫాలో అవుతున్న ప్రభాస్, 1 మిలియన్ దిశగా

ట్రెండ్ ఫాలో అవుతున్న ప్రభాస్, 1 మిలియన్ దిశగా

ప్రభాస్‌కు ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లో మాత్రమే అకౌంట్ ఉండేది. అయితే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ట్రెడింగులో ఉండటం, అభిమానులు కూడా ఇందులో ఖాతా ఓపెన్ చేయాలని కోరడంతో ఇటీవలే ఇందులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఖాతాను ఫాలో అయ్యేవారి సంఖ్య 1 మిలియన్‌కు చేరువైంది.

సాహో ప్రమోషన్స్ దీని ద్వారానే...

సాహో ప్రమోషన్స్ దీని ద్వారానే...

ప్రభాస్ త్వరలో ‘సాహో' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేస్తారని తెలుస్తోంది.

బాహుబలిని మించే స్థాయిలో సాహో

బాహుబలిని మించే స్థాయిలో సాహో

యూవి క్రియేషన్స్ వారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో సాహో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన మొత్తం కంటే ‘సాహో'కు ఎక్కువగా ఖర్చు పెడుతుండటం చర్చనీయాంశం అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, ఎవలీన్ శర్మ, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X