Radhe Shyam Teaser: చరిత్ర సృష్టించిన ప్రభాస్.. ఇండియాలో రెండో స్థానం.. తెలుగులో రికార్డులన్నీ ఉఫ్
కృష్ణం రాజు ఫ్యామిలీ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే 'బాహుబలి' వంటి భారీ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.
ఈ మూవీతో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో పాటు మార్కెట్ కూడా భారీగా విస్తరించింది. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ చరిత్ర సృష్టించింది. ఆ వివరాలు మీకోసం!

‘రాధే శ్యామ్' అంటోన్న ప్రభాస్
ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్‌లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్‌గా ఉండే జ్యోతిష్యుడి పాత్రను చేస్తున్నాడు. ఎన్నో అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రం 2022 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

చాలా ఆలస్యం.. బిజినెస్ భారీగా
'రాధే శ్యామ్' మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించి చాలా కాలమే అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దీనికి కారణం ఈ సినిమా మొదలైన తర్వాత పలుమార్లు ఆటంకాలు ఏర్పడడమే. దీంతో ఇప్పుడు బ్యాలెన్స్ వర్క్‌ను పూర్తి చేస్తోంది చిత్ర యూనిట్. ఇక, ఈ మూవీ నుంచి అప్పుడప్పుడూ వస్తున్న అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ప్రభాస్ నటించే ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

‘రాధే శ్యామ్' టీజర్ విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23)ను పురస్కరించుకుని 'రాధే శ్యామ్' మూవీ నుంచి టీజర్ వీడియోను విడుదల చేశారు. 78 సెకెన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రభాస్ అభిమానులకే కాకుండా సినీ ప్రియులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక, ఇందులో ప్రభాస్ పోషిస్తోన్న విక్రమాదిత్య పాత్రను పరిచయం చేశారు. ఇందులో అతడు ఇంగ్లీష్‌లో డైలాగులు చెబుతుండగా.. కింద సబ్ టైటిల్స్ వేశారు. ఇక, ఇందులో ప్రభాస్ కనిపించిన తీరు హైలైట్‌గా ఉంది. అలాగే, చివర్లో కనిపించిన విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

టీజర్‌కు భారీ స్పందన.. రికార్డు
'రాధే శ్యామ్' మూవీ నుంచి వచ్చిన టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఇందులో చిత్ర యూనిట్ ఇచ్చిన ట్విస్టుకు అందరూ ఫిదా అయిపోయారు. అంతేకాదు, ఇది ఎంతో గ్రాండ్‌గా, ఆసక్తికరంగా ఉండడంతో రిపీట్‌గా చూసేశారు. దీన్ని ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. సామాన్య సినీ ప్రియులు కూడా ఆదరించారు. దీంతో ఈ వీడియోకు భారీగా వ్యూస్, లైకులు వచ్చాయి. ఇక, ఈ టీజర్ 24 గంటల్లోనే ఏకంగా 42.67 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అలాగే, ఈ వీడియో ఒకరోజులోనే 493.5K లైకులను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.
ఇండియాలో 2... మూడు కూడా
24 గంటల్లోనే ఏకంగా 42.67 మిలియన్ వ్యూస్‌ను అందుకున్న 'రాధే శ్యామ్' టీజర్ ఎన్నో అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేసింది. ఇండియాలో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్ల జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు 'కేజీఎఫ్ చాప్టర్ 2' 68.83 మిలియన్ వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. ఇక, ఇందులో ప్రభాస్ నటించిన 'సాహో' 44.50 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఇక, నాలుగో స్థానంలో 'రోబో', ఐదో స్థానంలో 'రామరాజు ఫర్ భీమ్' టీజర్లు ఉన్నాయి. అంటే టాప్ 5లో ప్రభాస్ సినిమాలు రెండున్నాయి.

తెలుగులో మాత్రం నెంబర్ వన్
వ్యూస్ పరంగా ఇండియాలో రెండో స్థానంలో నిలిచిన 'రాధే శ్యామ్' టీజర్.. తెలుగు ఛానెల్‌లో మాత్రమే 42.67 మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టీజర్‌గా ఇది చరిత్రను సృష్టించింది. తద్వారా 'సర్కారు వారి పాట' పేరిట ఉన్న 23.06 మిలియన్ వ్యూస్ రికార్డును చెరిపేసింది. దీంతో ఇది రెండో స్థానానికి పడిపోయింది. ఇక, పుష్ప టీజర్ మూడో స్థానంలో, సరిలేరు నీకెవ్వరు టీజర్ నాలుగులో, రామరాజు ఫర్ భీమ్ ఐదులో ఉన్నాయి. ప్రభాస్ మరో చిత్రం సాహో టీజర్ ఆరో స్థానంలో నిలిచింది.
Recommended Video

అందులో మాత్రం ఏడో స్థానమే
ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' టీజర్‌కు 24 గంటల్లోనే భారీ స్థాయిలో వ్యూస్ వచ్చినప్పటికీ.. లైకుల పరంగా మాత్రం అంతగా రాణించలేకపోయింది. దీనికి కేవలం 493.5K లైకులు వచ్చాయి. తద్వారా టాలీవుడ్‌లో ఎక్కువ లైకులు సాధించిన టీజర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ఇందులో రామరాజు ఫర్ భీమ్ టీజర్ 940.3K లైకులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పుష్ప టీజర్, మూడో స్థానంలో వకీల్ సాబ్, నాలుగో స్థానంలో సర్కారు వారి పాట, ఐదులో ఆచార్య టీజర్లు ఉన్నాయి. ఇందులో సాహో ఎనిమిదో స్థానంలో ఉండడం గమనార్హం.


Click it and Unblock the Notifications











