Radhe shyam రిజల్ట్ పై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్.. ముందే ఊహించినట్లుగా కామెంట్!

బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత కూడా అదే తరహాలో మార్కెట్ను కంటిన్యూ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రభాస్-రాజమౌళి లేని లోటును చూపించే విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అందుకుంటున్నాడు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో అలాగే రాధే శ్యామ్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇటీవల రాధే శ్యామ్ సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ముందుగానే స్పందించినట్లు దర్శకుడు రాధాకృష్ణ వివరణ ఇచ్చాడు.

ఎంతో నమ్మకంతో..

ఎంతో నమ్మకంతో..

పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన రాధే శ్యామ్ డిఫరెంట్ లవ్ అడ్వెంచర్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల ముందు వరకు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు రాధాకృష్ణ, ప్రభాస్ ప్రతీ ఇంటర్వ్యూలో కూడా సినిమా చూసిన తరువాత అందరూ ప్రేమలో మునిగి తెలుతారు అని చెప్పారు.

ముందే విదేశాలకు వెళ్లిపోయిన ప్రభాస్

ముందే విదేశాలకు వెళ్లిపోయిన ప్రభాస్

ఇక ప్రభాస్ తీరిక లేకుండా రెగ్యులర్ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే విడుదలకు ఒక రోజు ముందే ప్రభాస్ విదేశాలకు వెళ్ళిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా రిజల్ట్ పై చాలా టెన్షన్ గా ఉన్న ప్రభాస్ కాస్త ప్రశాంతత కోసమే ఇటలీ వెళ్లి పోయినట్లుగా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపించింది. అయితే ప్రభాస్ మాత్రం ప్రత్యేకంగా సర్జరీ కోసం ఇటలీ వెళ్ళిపోయినట్లు ఆ తర్వాత ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.

సినిమా సక్సెస్ అంటూ..

సినిమా సక్సెస్ అంటూ..

ఇక సినిమాకు బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు కలెక్షన్స్ తగ్గిపోవడంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా రోజు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే దర్శకుడు రాధాకృష్ణ మాత్రం ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ప్రతి ఇంటర్వ్యూ లో అలాగే సోషల్ మీడియాలో కూడా సినిమా సక్సెస్ అయ్యింది అనే విధంగా వివరణ ఇస్తూ వస్తున్నాడు.

ప్రభాస్ ను కలవలేదు

ప్రభాస్ ను కలవలేదు

అలాగే రాధే శ్యామ్ సినిమాకు విమర్శలు కూడా అంత తక్కువగా ఏమీ రాలేదు అని చెప్పిన రాధాకృష్ణ విడుదల అనంతరం ప్రభాస్ ముందుగానే రిజల్ట్ పై ఒక వివరణ ఇచ్చినట్లు గా దర్శకుడు తెలియజేశాడు. సినిమా విడుదల తర్వాత ప్రభాస్ ను డైరెక్ట్ గా కలిసే అవకాశం రాలేదని ఆయన విదేశాలకు వెళ్ళినట్లుగా చెబుతూ ఫోన్ లో మాత్రం ఇద్దరం మెసేజ్ లతో టచ్ లోనే ఉన్నట్లుగా తెలియజేశాడు.

ప్రభాస్ రియాక్షన్

ప్రభాస్ రియాక్షన్

ఇక ఈ సినిమాకు వస్తున్నా టాక్ ను బట్టి ప్రభాస్ వివరణ ఇస్తూ తొలి మూడు రోజులు కూడా తన ఇమేజ్ సినిమాపై కొంచెం డామినేట్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్లుగా ప్రభాస్ స్పందించినట్లు రాధాకృష్ణ వివరణ ఇచ్చాడు. దీన్నిబట్టి ప్రభాస్ సినిమా రిజల్ట్ ను ముందుగానే ఊహించి ఏదైనా జరగవచ్చు అనే విషయాన్ని కూడా చిత్ర యూనిట్ సభ్యులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక రాధే శ్యామ్ అనంతరం ప్రభాస్ సలార్ ఆది పురుష్, రాజా డీలక్స్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ సినిమాలతో రాబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X