Remuneration కల్కి మూవీకి ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ స్టార్ హీరో రేంజ్‌లో..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ రిలీజ్‌కు సిద్దవుతున్నది. ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా తెరకెక్కుతున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నది. ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను ప్రభాస్ తీసుకొన్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆయన ఎంత పారితోషికం తీసుకొన్నారనే వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కల్కి ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ఇక మూవీని మే మాసంలో వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఏపీ, తెలంగాణలోను, అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Prabhas Remuneration for Kalki 2898 AD Here is the full details

అయితే కల్కి సినిమాను మే 30 తేదీన రిలీజ్ చేయాలని డిస్టిబ్యూటర్లు, అయితే జూన్‌లో రిలీజ్ చేయడానికి నిర్మాత ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. జూన్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతుండటంతో ఆ తర్వాత కల్కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. కల్కి సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ కంటే.. అమితాబ్, దీపిక పదుకోన్, కమల్ హసన్ లాంటి అగ్రతారల రెమ్యునరేషన్లకు ఎక్కువగా ఖర్చు అయిందనే టాక్. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్‌కు రికార్డు స్థాయి రెమ్యునరేషన్ చెల్లించినట్టు తెలుస్తున్నది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకొన్న హీరోల్లో ఒకరిగా రెబల్ స్టార్ మారారని చెప్పుకోంటున్నారు.

Prabhas Remuneration for Kalki 2898 AD Here is the full details

ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఊహకు అందని విధంగా మారింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువకు తగినట్టుగా ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సుమారుగా 200 కోట్ల నుంచి 250 కోట్ల మేర పారితోషికం రెబల్ స్టార్ అందుకొన్నట్టు తెలుస్తున్నది. ఇదే నిజమైతే.. షారుక్ తర్వాత ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకొన్న హీరోల్లో ఒకరిగా రికార్డు క్రియేట్ చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X