Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సాహోపై ఎట్టకేలకు స్పందించిన ప్రభాస్.. ఆరు రోజుల కలెక్షన్లు ఇవే..
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. ప్రతికూల రివ్యూల మధ్య ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటింది. బాహుబలి తర్వాత బాలీవుడ్లో ప్రస్తుత ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ చిత్రం నిలిచింది. వసూళ్ల పరంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో స్పందించాడు. ప్రభాస్ ఏమన్నాండంటే..
అభిమానులకు, ఆడియెన్స్‌కు
ప్రియమైన అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మీరు కురిపించిన ప్రేమ, ఆదరణ మరిచిపోలేనిది. మీ ప్రేమానురాగాలకు ప్రతిరూపమే ఈ సినిమా కలెక్షన్లు. మీరు చూపించిన రెస్పాన్స్ వల్లే సాధ్యమైంది అంటూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ప్రభాస్ నటించిన సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ.350 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.
ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో
ఇక తెలుగు రాష్ట్రాల్లో సాహో చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్‌గా నిలిచింది. గత ఆరు రోజుల్లో సాహో చిత్రం రూ.73.48 కోట్లు వసూలు చేయగా, మహర్షి రూ.56.66 కోట్లు, అరవింద సమేత రూ.55.63 కోట్లు, రంగస్థలం రూ. 53.22 కోట్లు, వినయ విధేయ రామ రూ.46.85 కోట్లు, భారత్ అనే నేను రూ. 49.2 కోట్లు, డీజే రూ.49.1 కోట్లు సాధించింది.
నైజాంలో వసూళ్లు
గత ఆరు రోజుల్లో నైజాంలో సాహో కలెక్షన్లు భారీగానే నమోదయ్యాయి. హాలీడే కలిసి రావడంతో సాహోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తొలి రోజు రూ.9.41 కోట్లు, రెండో రోజు రూ.5.21 కోట్లు, మూడో రోజు రూ.4.92 కోట్లు, నాలుగు రోజు రూ.3.8 కోట్లు, ఐదో రోజు రూ.1.5 కోట్లు, ఆరో రోజు రూ.78 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం నైజాంలో రూ.26.46 కోట్లు రాబట్టడం విశేషం.
సీడెడ్‌లో వసూళ్లు
ఇక సాహో మూవీ సీడెడ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలి రోజు రూ.4.7 కోట్లు, రెండో రోజు రూ.1.66 కోట్లు, మూడో రోజు రూ.1.54 కోట్లు, నాలుగు రోజు రూ.1.62 కోట్లు, ఐదో రోజు రూ.0.66 కోట్లు, ఆరో రోజు రూ.0.23 కోట్లు నమోదయ్యాయి. వసూలు చేశాయి. సీడెడ్ బిజినెస్ రూ.23.6 కోట్లు కాగా, డిస్టిబ్యూటర్లు నష్టపోకుండా ఉండాలంటే ఈ చిత్రం సీడెడ్‌లో రూ.13.59 కోట్లు రాబట్టాల్సి ఉంది.