సాహోలో ప్రభాస్ వాడిన బైక్ ఎంటో తెలుసా? ధర ఎంతంటే... మిషన్ ఇంపాజిబుల్‌లో కూడా!

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా బాహుబలికి మంచి ఆదరణ లభించడంతో ప్రభాస్, రానా జాతీయ స్థాయి హీరోలుగా మారిపోయారు. బాహుబలి తర్వాత అంచనాలు పెరిగిపోవడంతో ఆ స్థాయికి తగినట్టుగా ప్రభాస్ సాహో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కోసం వాడిన బైక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేమిటంటే...

సాహో కోసం ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్

సాహో కోసం ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న సాహో చిత్రంలో ప్రభాస్ కోసం ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ అనే బైక్‌ను ఉపయోగించారు. దుబాయ్‌లో గతేడాది చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్‌ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ బైక్‌ గురించి ఫ్యాన్స్ గూగుల్‌లో విపరీతంగా వెతికారు.

 సరికొత్తగా సాంకేతిక మార్పులతో

సరికొత్తగా సాంకేతిక మార్పులతో

హాలీవుడ్‌లో ఛేజింగ్ సీక్వెన్స్‌లో విపరీతంగా వాడే బైక్ ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్. తాజాగా అనేక సాంకేతిక మార్పులతో ఈ బైక్‌ను మార్కెట్‌లోకి తెచ్చారు. 765 సీసీ లైన్ త్రీ సిలెండర్ ఇంజిన్ ద్వారా ఈ బైక్‌కు పవర్ సప్లై అవుతుంది. 121 బీహెచ్‌పీతో 11700 ఆర్పీఎం, 77ఎన్ఎం పీక్ టార్క్‌తో 10800 ఆర్పీఎం దీని ప్రత్యేకతలు.

ప్రభాస్ వాడిన బైక్ ధర ఎంతంటే

ప్రభాస్ వాడిన బైక్ ధర ఎంతంటే

ప్రభాస్ వాడిన ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధర కూడా కాస్త ఎక్కువే. టాప్ లైన్ మోడల్ ధర రూ.10.55 లక్షలు (ఎక్స్ షో రూమ్ ధర). ధరకు తగిన క్రేజ్‌ ఈ బైక్‌కు మార్కెట్లో ఉంది. ఈ వాహనాన్ని హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో కూడా ఉఫయోగించారు.

 మిషన్ ఇంపాసిబుల్‌తోపాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో

మిషన్ ఇంపాసిబుల్‌తోపాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో

ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌ను మిషన్ ఇంపాసిబుల్ 2లో ఉపయోగించారు. అంతేకాకుండా లండన్ హ్యాస్ ఫాలెన్ అనే చిత్రంలో ఛేజింగ్ సన్నివేశాల కోసం ఉపయోగించారు. ది ట్రింప్ త్రోక్సటన్ ఆర్ అనే బైక్‌ను యాంట్ మ్యాన్ సిరీస్, యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ చిత్రాల్లో ఉపయోగించారు.

బైక్, కార్లపై మోజు పెంచుకొన్న ప్రభాస్

బైక్, కార్లపై మోజు పెంచుకొన్న ప్రభాస్

సాహో షూటింగ్ సమయంలో మోజు పెంచుకొన్న ప్రభాస్ ఈ బైక్‌ను సొంతానికి ఉపయోగించుకొంటున్నారట. ఈ బైక్‌నే కాకుండా సాహో చిత్రంలో వాడిన కారును కూడా ఏకంగా ఇంటికి తీసికెళ్లినట్టు సమాచారం. సాహో చిత్రం కోసం ప్రత్యేకంగా కార్లను, మోటర్ బైక్స్‌ను డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే.

 భారీగా ఛేజింగ్, యాక్షన్ సీన్లతో

భారీగా ఛేజింగ్, యాక్షన్ సీన్లతో

సాహో చిత్రం రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్నది. గతేడాది దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద తెరకెక్కించిన యాక్షన్ సీన్ల కోసమే రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. కేవలం ఇంటర్వెల్ సీన్ కోసమే రూ.30 కోట్లు ఖర్చు చేశారనేది సినీ వర్గాలు టాక్. నేషనల్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన శ్రద్ధాకపూర్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X